విహారయాత్రలో విషాదం.. పడవ బోల్తా పడి ఇద్దరు మృతి

విహారయాత్రలో విషాదం.. పడవ బోల్తా పడి ఇద్దరు మృతి

వికారాబాద్ జిల్లాలో విషాదం నెలకొంది.  సర్పన్ పల్లి ప్రాజెక్టులో పడవ బోల్తాపడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా  మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

హైదరాబాద్ కు చెందిన నలుగురు ప్రాజెక్టు సమీపంలోని రిసార్ట్ కు  విహారయాత్రకు వెళ్ళగా ఒక్కసారిగా  పడవ బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది. నలుగురిలో ఇద్దరు మృతి చెందగా ఇద్దరిని స్థానికులు రక్షించారు. వెంటనే బాధితులను  స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

ప్రభుత్వ అనుమతులు లేకుండా బోటు నడుపుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.  కాలం చెల్లిన బోటుల్లో కూర్చోబెట్టారని నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు  పర్యాటకులు. ఎటువంటి జాగ్రత్తలు లేకుండా బోటులో కూర్చోబెట్టారని చెబుతున్నారు.  వెల్డర్నెస్ రిసార్ట్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లనే ఇలా జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు  మహిళా పర్యాటకులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.