ఫ్లైట్ చార్జీలు మూడు రెట్లు పెరిగే చాన్స్

ఫ్లైట్ చార్జీలు మూడు రెట్లు పెరిగే చాన్స్

న్యూఢిల్లీ : లాడ్ డౌన్ ఎఫెక్ట్ ఫ్లైట్ తో ఫ్లైట్ చార్జీల మోత మోగనుంది. ఈ నెల 14 తర్వాత కేంద్రం లాక్ డౌన్ ఎత్తివేసినా… కొనసాగించినా ఆ తర్వాత కొన్ని రోజుల పాటు ఫ్లైట్ -చార్జీలు దాదాపు మూడు రెట్లు పెరగనున్నాయి. లాక్ డౌన్ తర్వాత కూడా విమానయ సంస్థలు ప్రయాణాల్లో సోషల్ డిస్టెన్స్ మెయింటెన్ చేయాలని నిర్ణయించాయి. ఇందుకు సంబంధించి ఏవియేషన్ అధికారులు విమాన సంస్థలతో ఇప్పటికే చర్చలు జరిపారు. ఒక్క ఫ్లైట్ లో మూడో వంతు మంది ప్రయాణికులనే అనుమతించాలని నిర్ణయించారు. మూడు సీట్లున్న వరుస లో ఒక్క ప్రయాకుడికే అనుమతిస్తారు. ఈ కారణంగా చార్జీలను మూడు రెట్లు పెంచే అవకాశం ఉందని ఓ ఇంగ్లీష్ పేపర్ కథనంలో తెలిపింది. కరోనా ఎఫెక్ట్ తగ్గే వరకు విమాన ప్రయాణాల్లో సోషల్ డిస్టెన్స్ మెయింటెన్ చేయనున్నారు. చాలా విమాన సంస్థలు ఏప్రిల్ 14 తర్వాత బుకింగ్స్ ను ప్రారంభించాయి. కేంద్రం విమాన ప్రయాణాలకు అనుమతిస్తుందని ఆయా సంస్థలు దీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇదే సమయంలో రైల్వే బుకింగ్స్ పై స్పష్టత రావటం లేదు. ముందుగా ఈ నెల 15 నుంచి బుకింగ్స్ అనుమతిస్తామన్న రైల్వే ఆ తర్వాత నిర్ణయాన్ని మార్చుకుంది. లాక్ డౌన్ పై కేంద్రం నిర్ణయం తర్వాతే రైళ్లు నడపటం పై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. కరోనా కారణంగా దేశంలోని చాలా ప్రాంతాల్లో లక్షలాది మంది చిక్కుకుపోయారు. వారంతా రైళ్లు ఎప్పుడు స్టార్ట్ అవుతాయా అని ఎదురుచూస్తున్నారు. రైళ్ల ప్రయాణాలు లేకుండా విమానాలను నడిపితే ప్రయాణికులపై పెద్ద ఎత్తున భారం పడనుంది. రైళ్లలో కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటెన్ చేస్తూ పరిమిత సంఖ్యలో ప్రయాణాలు అనుమతించాలని అధికారులు భావిస్తున్నారు.