న్యూఢిల్లీ : పోటీ పడుతూ ధరలపై ఆఫర్స్ ప్రకటించిన ఫ్లైట్ సంస్థలు ఒక్కసారిగా ఛార్జీలను పెంచాయి. ఢిల్లీ-ముంబై వన్‌వే ప్రయాణానికి గురువారం పలు ఎయిర్ లైన్లలో విమాన చార్జీలు రూ 20,000 నుంచి ప్రారంభమయ్యాయి. పాక్ తో నెలకొన్న ఉద్రిక్తతల క్రమంలో బుధవారం పలు ఎయిర్ పోర్టుల్లో విమాన రాకపోకలు నిలిచిన క్రమంలో చార్జీలు భారీగా పెరిగాయని చెబుతున్నారు.
ఒక స్టాప్ తో ఢిల్లీ-ముంబై మధ్య విమానాలకు రూ 8500 నుంచి పలు విమానయాన సంస్థలు చార్జ్ చేస్తున్నాయి. న్యూఢిల్లీ-గోవా రూట్ లో విమాన చార్జీలు రూ 12 వేల నుంచి ప్రారంభమయ్యాయి. ఢిల్లీ-శ్రీనగర్ రూట్ లో ఒకటి రెండు ఎయిర్ లైన్స్ మాత్రమే విమాన సర్వీసులను నడుపుతుండగా.. ఈ రూట్ లో విమాన సర్వీసులకు తీవ్ర డిమాండ్ ఏర్పడింది. ఫ్లైట్స్ సీట్లు ముందే బుకింగ్ అయ్యాయి. ఇప్పుడున్న వాటిని మరింత పెంచాయి విమాన సంస్థలు.
