నెల్లూరులో రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన MRO శాంతిస్వరూప్..

నెల్లూరులో రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన MRO శాంతిస్వరూప్..

ఏపీలోని నెల్లూరు జిల్లాలో రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు ఎమ్మార్వో శాంతి స్వరూప్. నెల్లూరు జిల్లాలోని ఏఎస్ పేటలో శనివారం ( జూన్ 20 ) ఏసీబీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు ఎమ్మార్వో శాంతిస్వరూప్. జిల్లాకు చెందిన కృష్ణారెడ్డి అనే రైతు తన పట్టాదారు పాస్ పుస్తకంలో పేరు మార్పు కోసం ఏఎస్ పేట తహసీల్దార్ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నారు.

అయితే.. పాస్ పుస్తకంలో పేరు మార్చడం కోసం ఎమ్మార్వో శాంతిస్వరూప్ రైతు నుంచి రూ.20 వేలు డిమాండ్ చేయడంతో లంచం ఇవ్వడం ఇష్టం లేని రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బాధితుడు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఇవాళ మధ్యాహ్నం ఏఎస్ పేట ఎమ్మార్వో ఆఫీసులో బాధితుడి నుంచి లంచం తీసుకుంటుండగా శాంతిస్వరూప్ ను పట్టుకున్నారు ఏసీబీ అధికారులు.

ALSO READ : ఉద్యోగాల పేరుతో రూ. 52 లక్షల భారీ మోసం.. 

అనంతరం శాంతిస్వరూప్ ను అదుపులోకి తీసుకుని రికార్డులను పరిశీలించారు అధికారులు. అవినీతికి పాల్పడే ఏ అధికారిని వదిలిపెట్టేది లేదని, లంచం డిమాండ్ చేస్తే వెంటనే ఏసీబీకి ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.