ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్: స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలు, షాపింగ్ పై 88% వరకు డిస్కౌంట్..

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్: స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలు, షాపింగ్ పై 88% వరకు డిస్కౌంట్..

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్  మొదలైంది. ఈ పండుగ సేల్ లో  చాలా రకాల వస్తువులపై భారీ డిస్కౌంట్స్ అందిస్తుంది. దింతో స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌ల నుండి ఇంట్లో వస్తువులు, బట్టలు, ఫర్నిచర్ ఇంకా  ఇతర వస్తువులను తక్కువ ధరకే కొనే అవకాశం ఇస్తుంది. దీనికి తోడు బ్యాంక్ ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఇవి కాకుండా స్మార్ట్ టీవీలు, వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్ల వంటి వాటిపై భారీ డిస్కౌంట్స్ ఉన్నాయి.
 
ఫర్నిచర్ విభాగంలో సోఫాలు, వార్డ్‌రోబ్‌లు, ఆఫీస్ కుర్చీలు, రిక్లైనర్ల వంటి వాటిపై బెస్ట్ డీల్స్ అందిస్తుంది. ఇక ఫ్యాషన్ ఇష్టపడేవారికి, పండగ వేడుకల కోసం ట్రెడిషనల్  దుస్తులు (ethnic wear), వాచీలు, చెప్పులు ఇంకా ఇతర ఉపకరణాలపై భారీ డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి. ఇవే క్లాకుండా  బియర్డో, హిమాలయ వంటి బ్రాండ్లు గ్రూమింగ్ కిట్‌లపై ఆఫర్‌లు ఇస్తుంది. పిల్లల కోసం బొమ్మలు, నిత్యావసర సరుకులు కూడా ఈ సేల్‌లో ఉన్నాయి.

టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్:
*ఆపిల్ ఐఫోన్ 16 ఇప్పుడు అత్యంత తక్కువ ధరకు రూ.54,999కే దొరుకుతోంది. అంటే దీని మొదట లాంచ్ ధర కంటే రూ. 25 వేలు తక్కువ.
*Samsung Galaxy S24 FE ఇప్పుడు కేవలం రూ. 29,999కే లభిస్తుంది అంటే 50% తగ్గింపు.
*పవర్ ఫుల్  ప్రాసెసర్‌తో ప్రీమియం Samsung Galaxy S24ను రూ.38,999కే సొంతం చేసుకోవచ్చు.
*రియల్‌మీ 15 ప్రో ధర రూ.26,999 నుండి మొదలవుతుంది, దీనితో పాటు  బ్యాంక్ ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు కూడా ఉన్నాయి. 
*Samsung Galaxy F36 ధర  రూ.13,999 నుండి మొదలవుతుంది, దీనిపై కూడా  బ్యాంక్ & ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు ఉన్నాయి. 
*Vivo T4R 5G ధర రూ. 17,499 నుండి మొదలవుతుంది, దీనిపై 10% బ్యాంక్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ ఆఫర్స్ ఉన్నాయి.

ALSO READ : సెప్టెంబరులో భారీగా తగ్గిన ద్రవ్యోల్బణం..

స్మార్ట్‌వాచ్‌లు & ఇతర వస్తువులపై భారీ తగ్గింపు:
*Samsung స్మార్ట్‌వాచ్‌లు (LTE, బ్లూటూత్ మోడల్స్‌తో సహా) 72% వరకు తగ్గింపుతో లభిస్తున్నాయి. 
*Apple Watch Series 10 & SE మోడళ్లపై 37% వరకు తగ్గింపు లభిస్తుంది.
*AMOLED డిస్‌ప్లే, GPS, బ్లూటూత్ కాలింగ్‌తో వచ్చే నాయిస్ స్మార్ట్‌వాచ్‌లు 81% వరకు, boAt స్మార్ట్‌వాచ్‌లు (SpO2, హార్ట్ రేట్ మానిటర్, IP68 వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్స్ ఉన్నవి) 88% వరకు తగ్గింపుతో లభిస్తాయి.

టాబ్లెట్‌లపై 50% వరకు తగ్గింపు: టాబ్లెట్లను ఇష్టపడేవారు Samsung Galaxy Tabs (Tab S9 FE, Tab S9 FE Plus వంటివి, Wi-Fi & 5G మోడల్స్‌తో సహా) పై 50% వరకు తగ్గింపు పొందవచ్చు. 

ఇతర ఆఫర్‌లు:
*ఫ్లిప్‌కార్ట్ SBI క్రెడిట్, డెబిట్ కార్డు కొనుగోళ్లపై ఇన్స్టంట్ 10% డిస్కౌంట్ ఇస్తోంది.
*ఇతర ఆప్షన్లలో జీరో-కాస్ట్ EMI, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు, సూపర్ కాయిన్ రివార్డులు ఉన్నాయి.
*ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్  ఉన్నోళ్లు అలాగే UPI ద్వారా పేమెంట్స్  చేసేవారికి కూడా అదనపు తగ్గింపులు ఉన్నాయి.

ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు ప్రత్యేక లాభాలు:
*ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు కూడా స్పెషల్  డీల్స్ ఉన్నాయి. 
*ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ మెంబర్‌షిప్ ఇప్పుడు ఏడాదికి రూ. 1,499 బదులు రూ.1,249కే లభిస్తుంది, దీని ద్వారా బెస్ట్ డీల్స్ ముందుగానే పొందే అవకాశం ఉంటుంది.