Inflation: సెప్టెంబరులో భారీగా తగ్గిన ద్రవ్యోల్బణం.. ఆహారం, ఇంధన ధరల తగ్గుదలే కారణం!

Inflation: సెప్టెంబరులో భారీగా తగ్గిన ద్రవ్యోల్బణం.. ఆహారం, ఇంధన ధరల తగ్గుదలే కారణం!

Retail Inflation: దేశంలో సెప్టెంబర్ 2025 నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 1.54 శాతం కిందకు తగ్గింది. దీంతో ద్రవ్యోల్బణం 8 ఏళ్ల  కనిష్ట స్థాయికి చేరింది. ఇది ఆగస్టులో నమోదైన 2.07 శాతంతో పోలిస్తే భారీ తగ్గుదల కావటం విశేషం. ఈ సంవత్సరం ఇది రెండవ సారి రిటైల్ ద్రవ్యోల్బణం 2 శాతం కంటే దిగువకు చేరుకోవటం. ఆగస్టులో కూడా ద్రవ్యోల్బణం 1.61 శాతం ఉండగా అది 6 సంవత్సరాలకు కనిష్ట స్థాయిగా ఉంది. 

ద్రవ్యోల్బణం తగ్గడానికి ప్రధాన కారణాలు.. ఆహార, ఇంధనం ధరల్లో తగ్గుదల. దీనికి తోడు కూరగాయలు, పప్పు ధాన్యాలు, టమోటాలు వంటి ఇతర వస్తువుల ధరలలో గణనీయమైన తగ్గుదల దోహదపడింది. GST రేట్ల సవరణల వల్ల కూడా కొన్ని వస్తువుల ధరలు తగ్గి పరోక్షమంగా.. ద్రవ్యోల్బణాన్ని తగ్గించడంలో సహాయపడింది. ఈ క్రమంలోనే RBI ఈ సంవత్సరం ద్రవ్యోల్బణ అంచనాలను 3.1% నుంచి 2.6%కి తగ్గించింది.

Also Read:-కార్లపై GSTనే కాదు.. దివాళీ బంపరాఫర్స్ : ఏ కంపెనీ కారుపై ఎన్ని లక్షల డిస్కొంట్ ఇస్తుందో ఫుల్ లిస్ట్

ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గడం ప్రజలకు, ప్రత్యేకించి మధ్య తరగతి, దిగువ ఆదాయ వర్గాలకు ఆర్థిక ఉపశమనం కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. రానున్న కాలంలో రిజర్వు బ్యాంక్ మరిన్ని వడ్డీ రేట్ల తగ్గింపులకు వెళ్లటానికి ఇది అండగా నిలుస్తుందని వారు చెబుతున్నారు. మెుత్తం మీద రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుదల దేశ ఆర్థిక వ్యవస్థ సాధారణ పరిస్థితులతో ముందుకు సాగుతున్నట్లు సూచిస్తుందని వారు చెబుతున్నారు. 

జీఎస్టీ మార్పులతో ప్రజలకు అందిన ఉపశనంతో పాటుగా తక్కువగా ఉన్న ఆహార, ఇంధన ధరలు ప్రజల కొనుగోలు శక్తిని పెంచి రానున్న కాలంలో డిమాండ్ వాతావరణాన్ని సృష్టిస్తుందని, ఇది కంపెనీల అమ్మకాల పెరుగుదలతో జీడీపీ వృద్ధికి దారితీస్తుందని ఆర్థిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు.