
దీపావళి పండుగ సందర్భంగా కార్ల తయారీ కంపెనీలు కొత్త కార్ల పై డిస్కౌంట్ల ఆఫర్స్ ప్రకటించాయి. అయితే ఎప్పటిలాగే ఈసారి కూడా కస్టమర్లను ఆకర్షిస్తూ మారుతి సుజుకి నుండి టాటా మోటార్స్ , కియా, హ్యుందాయ్, హోండా, రెనాల్ట్ కంపెనీలు ప్రముఖ మోడళ్లపై క్యాష్ బ్యాక్, ఎక్స్చేంజ్ అఫర్, కార్పొరేట్ డిస్కౌంట్, స్క్రాపేజ్ బెనిఫిట్స్ తీసుకొచ్చాయి. దింతో ఇప్పుడు సెలెక్ట్ చేసిన వేరియంట్లపై రూ.5 వేల నుండి రూ.7 లక్షల వరకు సేవింగ్స్ పొందోచ్చు.
టాటా మోటార్స్ కార్ల పై దీపావళి ఆఫర్లు: టాటా మోటార్స్ ఈ అక్టోబర్ 2025లో ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ (ICE) కార్లపై క్యాష్ అండ్ ఎక్స్ఛేంజ్ బోనస్ కలిపి అందిస్తోంది:
*టియాగో: రూ.10 వేల క్యాష్ బ్యాక్+ రూ.15 వేల ఎక్స్ఛేంజ్ అఫర్ (సెలెక్ట్ చేసిన వేరియంట్‌ల పై)
*టిగోర్: రూ.15 వేల క్యాష్ బ్యాక్ + రూ.15వేల ఎక్స్ఛేంజ్ అఫర్
*ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్: ఎలాంటి డిస్కౌంట్ లేదు
*పంచ్: రూ.5వేల క్యాష్ బ్యాక్+ రూ.15వేల ఎక్స్ఛేంజ్ అఫర్
*నెక్సాన్: రూ.10వేల క్యాష్ బ్యాక్+ రూ.15వేల ఎక్స్ఛేంజ్ అఫర్
*కర్వ్: రూ.20వేల క్యాష్ బ్యాక్+ రూ.20వేల ఎక్స్ఛేంజ్ అఫర్
*హారియర్ (ఫియర్‌లెస్ X):రూ.25వేల క్యాష్ బ్యాక్+రూ.25వేల ఎక్స్ఛేంజ్ అఫర్
*సఫారీ (అకంప్లిష్డ్ X): రూ.25వేల క్యాష్ బ్యాక్+ రూ.25వేల ఎక్స్ఛేంజ్ అఫర్
టాటా గ్రూప్ ఉద్యోగులకు సెలెక్ట్ చేసిన మోడళ్లపై కార్పొరేట్ డిస్కౌంట్లు కూడా ఇస్తుంది. కానీ ఈ ఆఫర్లు సెలెక్ట్ చేసిన వేరియంట్‌లకు మాత్రమే వర్తిస్తాయి.
కియా కార్లపై దీపావళి ఆఫర్లు : కియా కూడా పాపులర్ మోడళ్లపై డిస్కౌంట్లు, కార్పొరేట్ బెనిఫిట్స్ ప్రకటించింది.
సోనెట్: రూ.10వేల క్యాష్ బ్యాక్ + రూ.20వేల ఎక్స్ఛేంజ్ అఫర్ + రూ.15,000 కార్పొరేట్ డిస్కౌంట్లు
సెల్టోస్: రూ.30,వేల క్యాష్ బ్యాక్ + రూ.30వేల ఎక్స్ఛేంజ్ అఫర్ + రూ.15,000 కార్పొరేట్ డిస్కౌంట్లు
సైరోస్: రూ.35వేల క్యాష్ బ్యాక్ + రూ.30వేల ఎక్స్ఛేంజ్ అఫర్ + రూ.15,000 కార్పొరేట్ డిస్కౌంట్లు
కేరెన్స్ క్లావిస్: రూ.30వేల ఎక్స్ఛేంజ్ అఫర్ + రూ.20వేల లాయల్టీ + రూ.15,000 కార్పొరేట్ డిస్కౌంట్లు
కార్నివాల్: రూ.1 లక్ష ఎక్స్ఛేంజ్ అఫర్ + రూ.15వేల కార్పొరేట్ డిస్కౌంట్లు
ఈ ఆఫర్లు అక్టోబర్ 2025లో సెలెక్ట్ చేసిన నగరాల్లో ఎంపిక చేసిన వేరియంట్‌లపై మాత్రమే వర్తిస్తాయి.
హ్యుందాయ్ కార్లపై దీపావళి ఆఫర్లు: హ్యుందాయ్ కూడా చాల మోడళ్లపై క్యాష్ బ్యాక్, ఎక్స్ఛేంజ్ అఫర్, కార్పొరేట్ డిస్కౌంట్లు ఇస్తుంది.
గ్రాండ్ i10 నియోస్: రూ.25 వేలు (పెట్రోల్) / రూ.30వేలు (CNG) + రూ.25వేల వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ + రూ.5వేల కార్పొరేట్ డిస్కౌంట్ ఉంది.
ఆరా: రూ.15వేలు క్యాష్ బ్యాక్ +రూ.10వేల వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్+ రూ.5వేల కార్పొరేట్ డిస్కౌంట్
ఎక్స్‌టర్: రూ.25వేల వరకు (నాన్ ప్రో ప్యాక్) / రూ.20వేల (ప్రో ప్యాక్) క్యాష్ బ్యాక్ +రూ.20వేల వరకు ఎక్స్ఛేంజ్ అఫర్
i20: రూ.25వేల వరకు (MT), రూ.20వేల (IVT) క్యాష్ బ్యాక్+ రూ.25వేల వరకు ఎక్స్ఛేంజ్ అఫర్
వెన్యూ 1.2: రూ.30వేల క్యాష్ బ్యాక్+ రూ.15వేల ఎక్స్ఛేంజ్ అఫర్
వెన్యూ టర్బో: రూ.10వేల క్యాష్ బ్యాక్ + రూ.15వేల ఎక్స్ఛేంజ్ అఫర్
వెర్నా: రూ.20వేల క్యాష్ బ్యాక్+ రూ.10వేల కార్పొరేట్ + రూ.20వేల ఎక్స్ఛేంజ్ అఫర్
క్రెటా: రూ.5వేల స్క్రాపేజ్ బోనస్
అల్కాజార్: రూ.30వేల క్యాష్ బ్యాక్+ రూ.30వేల ఎక్స్ఛేంజ్ అఫర్
టక్సన్: రూ.30వేల క్యాష్ బ్యాక్+ రూ.60వేల ఎక్స్ఛేంజ్ అఫర్
Ioniq5 (MY 2024): రూ.7 లక్షల
స్క్రాపేజ్ బెనిఫిట్స్ 15 సంవత్సరాల కంటే పాత కార్లకు కూడా ఇస్తుంది.
హోండా కార్ల పై దీపావళి ఆఫర్లు : హోండా కంపెనీ క్యాష్ బ్యాక్, ఎక్స్ఛేంజ్ అఫర్, కార్పొరేట్ డిస్కౌంట్, లాయల్టీ, వారంటీ బెనిఫిట్స్ కలిపి అందిస్తుంది:
అమేజ్ 3వ జనరేషన్: రూ.67వేల వరకు ప్రయోజనాలు
నగరం: రూ.1.27 లక్షల వరకు ప్రయోజనాలు (రూ.25వేల ఎక్స్ఛేంజ్, రూ.4వేల లాయల్టీ, రూ.35వేల హోండా-టు-హోండా ఎక్స్ఛేంజ్, కార్పొరేట్ ప్రయోజనాలు, రూ.28వేల విలువైన 7 సంవత్సరాల వారంటీ)
ఎలివేట్ MT: రూ.1.32 లక్షల వరకు (నగదు + ఎక్స్ఛేంజ్ + లాయల్టీ + కార్పొరేట్ + హోండా-టు-హోండా లాయల్టీ ఎక్స్ఛేంజ్)
సిటీ eHEV హైబ్రిడ్: 7 సంవత్సరాల వారంటీ ఇస్తుంది.
మారుతి కార్లపై దీపావళి ఆఫర్ల వివరాలు: మారుతి సుజుకి కంపెనీ మోడళ్లపై దీపావళి 2025 పండుగ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. చిన్న కార్లలో ఆల్టో కె10 పై పెట్రోల్ & సిఎన్‌జి వేరియంట్లపై క్యాష్ బ్యాక్, ఎక్స్చేంజ్ అఫర్, స్క్రాపేజ్‌తో కలిపి రూ.52,500 వరకు తగ్గింపు లభిస్తుంది. వ్యాగన్ ఆర్ (పెట్రోల్ & సిఎన్‌జి) పై స్పాట్ డిస్కౌంట్, స్క్రాపేజ్‌తో సహా రూ.57,500 వరకు అతిపెద్ద ప్రయోజనాన్ని పొందవచ్చు. సెలెరియోపై సంస్థాగత, గ్రామీణ ప్రయోజనాలతో కలిపి రూ 2,500 వరకు, ఎస్-ప్రెస్సోపై మొదటిసారి కొనేవారికి రూ.47,500 వరకు ప్రయోజనాలు ఉన్నాయి.
పాపులర్ మోడళ్ల విషయానికి వస్తే, స్విఫ్ట్ (CNG వేరియంట్లతో సహా సెలెక్ట్ చేసిన ట్రిమ్‌లపై) రూ.48,750 వరకు బెనిఫిట్ ప్రయోజనాలను ఇస్తుంది. డిజైర్ అమ్మకాలపై రూ. 2,500 వరకు ప్రయోజనాన్ని ఇస్తుండగా.... బ్రెజ్జా ఎక్స్ఛేంజ్ & స్క్రాపేజ్ బోనస్‌లతో రూ.35,000 వరకు ప్రయోజనాలను అందిస్తుంది. ఎంపీవీలలో ఎర్టిగా (పెట్రోల్ & సిఎన్‌జి) పై రూ.25వేలు. ఈకో (అంబులెన్స్, పెట్రోల్ & సిఎన్‌జి, కార్గో వేరియంట్‌లను బట్టి) పై రూ.42,500 వరకు లభిస్తుంది.
నెక్సా (Nexa) మోడళ్లలో బాలెనో డెల్టా ఏఎంటీ (Delta AMT) వేరియంట్‌పై రూ.55,000 రీగల్ కిట్, క్యాష్ బ్యాక్ & ఎక్స్చేంజ్ తో కలిపి అత్యధికంగా రూ.1,05,000 వరకు ప్రయోజనాలు ఉన్నాయి, ఇతర ఏఎంటీ & మాన్యువల్/సిఎన్‌జి వేరియంట్లపై రూ.1,00,000 నుండి రూ.1,02,000 వరకు ప్రయోజనాలు ఉన్నాయి. గ్రాండ్ విటారా హైబ్రిడ్ వేరియంట్‌పై రూ.1,80,000 వరకు, పెట్రోల్/సిఎన్‌జి వేరియంట్లపై రూ.1,50,000/రూ.40,000 వరకు భారీ ప్రయోజనాలను అందిస్తోంది. ఎస్‌యూవీలలో, ఫ్రాంక్స్ టర్బో వేరియంట్‌పై రూ.880 వరకు, అలాగే 1.2లీ పెట్రోల్ వేరియంట్లపై రూ.22,000 నుండి రూ.39,000 వరకు ప్రయోజనాలు ఉన్నాయి.
ఇతర నెక్సా మోడళ్లలో, ఇగ్నిస్ ఏఎంటీపై రూ.75,000, మాన్యువల్‌పై రూ.70,000 వరకు ప్రయోజనాలు ఉన్నాయి. జిమ్నీ ఆల్ఫా ట్రిమ్‌పై ఫ్లాట్ రూ.70,000 క్యాష్ డిస్కౌంట్ ఉండగా, సియాజ్ లిమిటెడ్ స్టాక్‌పై రూ.45,000, XL6 పెట్రోల్‌పై రూ.25 వేలు, సిఎన్‌జిపై రూ.35,000 వరకు ప్రయోజనాలు ఉన్నాయి. కొత్త ఇన్విక్టో ఎంపీవీలో ఆల్ఫా+ ట్రిమ్‌పై క్యాష్ బ్యాక్, స్క్రాపేజ్‌తో రూ.1,40,000 వరకు, జీటా+ ట్రిమ్‌పై స్క్రాపేజ్ రూపంలో రూ.1,15,000 వరకు ప్రయోజనాలు ఉన్నాయి.
టాక్సీ/కమర్షియల్ విభాగంలో స్విఫ్ట్ టూర్ పై రూ.15వేలు, టూర్ H1 పై రూ.65,500, టూర్ H3 (CNG) పై రూ. 50వేలు, టూర్ వి & ఎంపై రూ. 35వేల వరకు వివిధ రకాల ప్రయోజనాలను మారుతి ప్రకటించింది.
రెనాల్ట్ సెలెక్ట్ చేసిన మోడళ్లపై దీపావళి సందర్భంగా ఆఫర్స్ ప్రకటించింది. ఈ ఆఫర్లలో క్యాష్ బ్యాక్, ఎక్స్చేంజ్, కార్పొరేట్ ఆఫర్స్, స్క్రాపేజ్ బెనిఫిట్స్ ఉన్నాయి. క్విడ్ (Kwid) మోడల్‌పై రూ.35,000 వరకు మొత్తం డిస్కౌంట్... ఇందులో రూ.20,000 వరకు క్యాష్, రూ.15,000 వరకు ఎక్స్చేంజ్ ప్రయోజనాలు ఉన్నాయి. దీనితో పాటు రూ.10,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్ కూడా ఉంది. కిగర్ (Kiger) ఫేస్‌లిఫ్ట్ కొనుగోలుపై రూ.45,000 వరకు మొత్తం సేవింగ్స్ ప్రకటించారు, వీటిలో రూ.15,000 వరకు ఎక్స్చేంజ్, రూ.35,000 వరకు స్క్రాపేజ్ రూ.10,000 వరకు కార్పొరేట్ ప్రయోజనాలు ఉన్నాయి. పాత కిగర్ (Kiger) ప్రీ-ఫేస్‌లిఫ్ట్ మోడల్‌పై అత్యధికంగా రూ.80,000 వరకు మొత్తం డిస్కౌంట్ ఉంది, ఇందులో రూ.35,000 వరకు క్యాష్, రూ.35,000 వరకు ఎక్స్చేంజ్, రూ.5,000 వరకు స్క్రాపేజ్, రూ.10,000 వరకు కార్పొరేట్ ప్రయోజనాలు ఉన్నాయి.
అదే విధంగా, ట్రైబర్ (Triber) ఫేస్‌లిఫ్ట్ మోడల్‌పై రూ.45,000 వరకు సేవింగ్స్,, ట్రైబర్ (Triber) ప్రీ-ఫేస్‌లిఫ్ట్ మోడల్‌పై రూ.75,000 వరకు మొత్తం బెనిఫిట్స్ ప్రకటించింది. ఈ ఆఫర్లు దీపావళి పండుగ సందర్భంగా వాహనాలను కొనాలనుకునే వారికి గొప్ప అవకాశం.