రాష్ట్రప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన రైతు డిస్కమ్‌‌‌‌లోకి 79 మంది ఉద్యోగులు

రాష్ట్రప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన రైతు డిస్కమ్‌‌‌‌లోకి 79 మంది ఉద్యోగులు
  •     ఉత్తర, దక్షిణ విద్యుత్​ పంపిణీ సంస్థల నుంచి డిఫ్యుటేషన్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన రైతు డిస్కమ్‌‌‌‌లోకి బుధవారం 79 మంది ఉద్యోగులు బదిలీ అయ్యారు. ఉత్తర, దక్షిణ విద్యుత్​ పంపిణీ సంస్థల నుంచి వీరిని డిఫ్యుటేషన్‌‌‌‌పై కేటాయించారు. ప్రధానంగా ఎస్‌‌‌‌పీడీసీఎల్​ పరిధి నుంచి 67 మంది బదిలీ అయ్యారు. నలుగురు సీఈలు, ముగ్గురు జీఎంలు, ముగ్గురు ఎస్ఈలు, ఆరుగురు డీఈఈలు, 10 మంది ఏడీఈలు, 14 మంది ఏఈలు, 27 మంది హెచ్‌‌‌‌ఆర్ స్టాఫ్‌‌‌‌తో పాటు ఇతర విభాగాలకు చెందిన ఉద్యోగులను బదిలీ చేస్తూ బుధవారం ఆ సంస్థ సీఎండీ జితేష్​ వి పాటిల్​ ఉత్తర్వులు జారీ చేశారు. 

అలాగే ఎన్‌‌‌‌పీడీసీఎల్​పరిధిలోని ఒక సీఈ, ఇద్దరు డీఈఈలు, ఒక ఏడీఈ, ఇద్దరు ఏఈలు, మరో ఆరుగురిని ఇతర విభాగాల నుంచి బదిలీ చేస్తూ ఆ సంస్థ సీఎండీ వరుణ్​రెడ్డి ఆర్డర్స్​ జారీ చేశారు. వీరంతా కూడా త్వరలోనే రైతు డిస్కమ్‌‌‌‌లో విధుల్లో చేరాల్సిందిగా సీఎండీలు ఆదేశించారు.