ఫ్లిప్‌‌‌‌ కార్ట్‌‌‌‌ ఆర్డర్లతో నెట్‌‌‌‌ ఫ్లిక్స్‌‌‌‌ ఉచితం..!

ఫ్లిప్‌‌‌‌ కార్ట్‌‌‌‌ ఆర్డర్లతో నెట్‌‌‌‌ ఫ్లిక్స్‌‌‌‌ ఉచితం..!

బెంగళూరు: ఈ–-కామర్స్ కంపెనీ ఫ్లిప్‌‌‌‌కార్ట్  కస్టమర్లను ఆకర్షించడానికి కొత్త ఆఫర్‌‌‌‌‌‌‌‌ను  ప్రకటించింది. ఈసారి తమ ఆర్డర్లు పెట్టేవారికి ఉచితంగా నెట్‌‌‌‌ఫ్లిక్స్ సబ్‌‌‌‌స్క్రిప్షన్‌‌‌‌ ఇవ్వనుంది. ఆగస్టు నుంచి  ఒక క్యాలెండర్ నెలలో కనీసం రూ.299 విలువైన 4 ఆర్డర్లను పూర్తి చేయాలి. కనీసం రూ.1,196 ఖర్చు చేయాలి. 

ఫ్లిప్‌‌‌‌కార్ట్ మెయిన్‌‌‌‌ యాప్, ఫ్లిప్‌‌‌‌కార్ట్ గ్రోసరీ  లేదా ఫ్లిప్‌‌‌‌కార్ట్ మినిట్స్  ద్వారా చేసిన కొనుగోళ్లు దీనికి వర్తిస్తాయి.  నాలుగో ఆర్డర్ పూర్తయిన తర్వాత ఫ్లిప్‌‌‌‌కార్ట్ యాప్ ద్వారా నెట్‌‌‌‌ఫ్లిక్స్ మంత్లీ మొబైల్ ప్లాన్‌‌‌‌ను ఉచితంగా యాక్టివేట్ చేసుకోవచ్చు.