బెంగళూరు అద్దె ఇళ్ల వ్యవహారంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద రచ్చే నడుస్తుంది. ఇంటి ఓనర్లు వసూలు చేసే సెక్యూరిటీ డిపాజిట్లపై ముంబైకి చెందిన ఓ మహిళ చేసిన పోస్ట్ అద్దెదారులు, ఇంటి ఓనర్ల మధ్య వాదనలకు కారణమైంది.
అసలు విషయం ఏంటంటే.. ముంబైకి చెందిన స్నేహా తమ్హంకర్ అనే మహిళ బెంగళూరులో అద్దె సెక్యూరిటీ డిపాజిట్ విధానాన్ని Xలో తప్పుబట్టారు. బెంగళూరులో ఇల్లు అద్దెకు తీసుకోవాలంటే బ్రోకర్లు, ఇంటి ఓనర్లు ఏకంగా ఆరు నెలల అద్దె డిపాజిట్‌గా అడుగుతున్నారని, ఇది బెంగళూరు నగరంలోనే జరుగుతున్న "అతిపెద్ద అద్దె మోసం" అని ఆమె చెప్పుకొచ్చారు. అయితే చట్టబద్ధంగా కేవలం రెండు నెలల అద్దె మాత్రమే డిపాజిట్‌గా తీసుకోవాలనేది తెలుసుకుని ఆశ్చర్యపోయినట్లు ఆమె పోస్ట్‌లో పేర్కొన్నారు.
అద్దెదారుల సపోర్ట్.. ఓనర్ల వాదన:
ఆమె పెట్టిన ఈ పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్లు రకాలుగా వాదిస్తున్నారు.
చాలా మంది యూజర్లు మాకు కూడా ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయని, మేము కూడా భారీగా డిపాజిట్లు చెల్లించామని... మద్దతుగా కామెంట్లు పెట్టారు. భారతదేశంలో ఏ చట్టమూ రెంట్ డిపాజిట్ మొత్తం పై పరిమితి నిర్దేశించలేదని కొందరు తెలిపారు.
►ALSO READ | స్వల్పంగా పెరిగిన బంగారం.. స్థిరంగా వెండి : తెలుగు రాష్ట్రాల్లో తులం ధర ఎంత పెరిగిందంటే ?
మరోవైపు ఇంటి ఓనర్లు కూడా వారి వైపు ఉన్న నష్టాలను వెల్లడించారు. అద్దెకు ఉన్నవాళ్లు కొన్నిసార్లు నెలల తరబడి రెంట్ ఇవ్వకుండా ఉండటం, ఇళ్లను పాడుచేసి వెళ్లిపోవడం చేస్తుంటారని.. అందుకే డిపాజిట్లు తప్పవని సమర్థించుకుంటున్నారు. బయటి మార్కెట్ పరిస్థితుల బట్టే ఈ డిపాజిట్లు ఉంటాయని వారు స్పష్టం చేస్తున్నారు.
అయితే కర్ణాటకలో దీనికి ఎలాంటి చట్టపరమైన రూల్ లేదని పలువురు స్పష్టం చేశారు. కేంద్రం తెచ్చిన 'మోడల్ టెనెన్సీ చట్టం'లో రెండు నెలల ప్రస్తావన ఉన్నప్పటికీ, కర్ణాటక ప్రభుత్వం దానిని ఇంకా అధికారికంగా ఆమోదించి చట్టం చేయలేదని తేలింది.
ఇక్కడ ఎలాంటి ఫిక్స్‌డ్ రూల్స్ లేవని.. ఓనర్, టెనెంట్ అంగీకారంతోనే డిపాజిట్ ఎంత ఉండాలనేది నిర్ణయమవుతుందని మార్కెట్ నిపుణులు అంటున్నారు.
The biggest bangalore rent scam isn’t that brokers tell you – Madam, the new legal deposit is 3 months. We typically charge 6, but we’ve brought it down to 4 for you.
— Sneha Tamhankar (@snehatea) July 30, 2026
It’s that I never bothered to look it up because I assumed the broker/landlord was openly mooching off me.
I…
