భార్యను చంపిన కేసులో జైలుకు.. బెయిల్పై వచ్చి భార్య సమాధి దగ్గర సచ్చిపోయిండు!

భార్యను చంపిన కేసులో జైలుకు.. బెయిల్పై వచ్చి భార్య సమాధి దగ్గర సచ్చిపోయిండు!
  •  రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలో ఘటన

ఇబ్రహీంపట్నం, వెలుగు: భార్యను క్రూరంగా హత్యచేసి జైలుకెళ్లి బెయిల్‌‌పై వచ్చిన ఓ వ్యక్తి ఆమె సమాధి వద్దే ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం నోముల గ్రామానికి చెందిన మాదరమోని బాబు(55), భార్య అమృత(45) భార్యభర్తలు. ఐదునెలల కింద భార్యను ఇంట్లోనే నరికి చంపాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. అతడిని అరెస్ట్​ చేశారు. 

ఇన్నాళ్లు జైలులో ఉన్న బాబు వారం కింద బెయిల్‌‌పై వచ్చాడు. జైలు నుంచి వచ్చాక మనోవేదనకు గురైన అతను.. శుక్రవారం ఉదయం తన పొలం వద్ద భార్యను సమాధి వద్ద ఉన్న  చెట్టుకు ఉరేసుకున్నాడు. పోలీసులకు సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకొని డెడ్‌‌బాడీని పోస్ట్‌‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మధు తెలిపారు.