రాజస్థాన్​లో వరదల బీభత్సం

రాజస్థాన్​లో వరదల బీభత్సం

రాజస్థాన్​లోని కోట జిల్లాలో 3500 మంది తరలింపు

కోట: రాజస్థాన్​లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపిలేకుండా పడుతున్న వర్షాలతో కోట, బరన్, ఝలావర్, బుండి జిల్లాలు నీట మునిగాయి. ఇప్పటికే బరన్ జిల్లాలో వరదల్లో ఇద్దరు కొట్టుకుపోయారు. బుండి జిల్లాలో మరో ఇద్దరు గల్లంతయ్యారు. ఈ జిల్లాల్లో స్కూళ్లకు అధికారులు సెలవులు ప్రకటించారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్​ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. బరన్ జిల్లాలో రెస్క్యూ ఆపరేషన్​ నిర్వహించేందుకు ఇండియన్ ఎయిర్​ ఫోర్స్ హెలికాఫ్టర్ రంగంలోకి దిగింది.

కోట జిల్లా కలెక్టర్ ఆధికారులతో సమావేశమై వరద తీవ్రతపై చర్చించారు. చంబల్ నది లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజలను తరలిస్తున్నారు. కోట జిల్లాలో ఇప్పటివరకు 3500 మందిని తరలించినట్లు పేర్కొన్నారు. 4 లక్షల మందికి సరిపడేలా వాటర్ ట్యాంకులను తరలించే ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఝలావర్‌‌ జిల్లాలో  చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలో ఉన్నాయని అధికారులు తెలిపారు.