జూరాలకు కొనసాగుతున్న వరద.. భద్రాచలం తగ్గుతున్న గోదావరి ఉధృతి

జూరాలకు కొనసాగుతున్న వరద.. భద్రాచలం తగ్గుతున్న గోదావరి ఉధృతి

భద్రాచలం/భూపాలపల్లి, వెలుగు : గోదావరి వరద ఉధృతి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. మేడిగడ్డ బ్యారేజీ వద్ద సోమవారం ఉదయం 4.27 లక్షల క్యూసెక్కులు ఉన్న వరద సాయంత్రానికి 2,55,360 క్యూసెక్కులకు చేరుకుంది. మేడిగడ్డ వద్ద 92.40 మీటర్ల ఎత్తులో నీరు పారుతోంది. బ్యారేజీ 85 గేట్లను ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు వదులుతున్నారు. భద్రాచలం వద్ద ప్రస్తుతం 36.70 అడుగుల ఎత్తులో 6,53,309 క్యూసెక్కుల వరద పారుతోంది.  

జూరాలకు కొనసాగుతున్న వరద

గద్వాల, వెలుగు : కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి జూరాల ప్రాజెక్టుకు వరద రాక కొనసాగుతోంది. ఎగువ నుంచి 1.92 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండడంతో 27 గేట్లను ఓపెన్ చేసి 1,85,400 క్యూసెక్కుల వరదను శ్రీశైలం ప్రాజెక్ట్ లోకి వదులుతున్నారు. అలాగే విద్యుత్ ఉత్పత్తి ద్వారా 31,758 క్యూసెక్కులు, నెట్టెంపాడు లిఫ్ట్ కు 750, బీమా-1కి 1300, కోయిల్ సాగర్ లిఫ్ట్ కు 630, లెఫ్ట్ కెనాల్ కు 820, రైట్ కెనాల్ కు 700, సమాంతర కాలువకు 400, బీమా లిఫ్ట్-2కి 872 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.