కోవిడ్ నుంచి కోలుకున్నాక ఇలా చేయండి..

V6 Velugu Posted on May 11, 2021

కొవిడ్ వచ్చిపోయాక కూడా అది తెచ్చిన తిప్పలు తగ్గట్లేదు వంట్లో. పోస్ట్​ కొవిడ్​లో చాలామంది రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు. నీరసం, ఒళ్లు నొప్పులు, బ్రీతింగ్​ ప్రాబ్లమ్స్​తో అవస్థలు పడుతున్నారు. వీటన్నింటి నుంచి బయట పడాలంటే కొన్ని ఆసనాలే మేలు. ఇదే మాటని ఫేమస్​ సెలబ్రిటీ ఫిట్​నెస్​ ఎక్స్​పర్ట్​ యాస్మిన్​ కరాచీవాలా కూడా చెప్తున్నారు.మన దేశంలో ఉన్న పాపులర్​ ఫిట్​నెస్​ ట్రైనర్స్​లో యాస్మిన్​ కరాచీవాలా ఒకరు. బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్స్​​ కత్రినా కైఫ్​ , దీపికా పదుకునే, పరిణితీ చోప్రా, ఆలియా భట్​ పర్సనల్​ ఫిట్​నెస్​  ట్రైనర్​​ యాస్మినే. రీసెంట్​గా యాస్మిన్​ కరోనా బారినపడింది. దాన్నుంచి పూర్తి స్థాయిలో కోలుకోడానికి వర్కవుట్స్​​ చాలా హెల్ప్​ చేశాయట ఆమెకి. ఆ వర్కవుట్స్​నే తన ఇన్​స్టాగ్రామ్​ పేజీలో పోస్ట్​ చేసింది. ‘వర్కవుట్స్​ నా ఊపిరితిత్తుల పని తీరుని మెరుగుపరిచాయి’ అని చెప్పింది. వీటిని ఒకదాని తర్వాత ఒకటి ఆర్డర్​లో చేయాలి. 

బెల్లీ బ్రీతింగ్

నేలపై వెల్లకిలా పడుకుని ఒక చేతిని ఛాతి పై భాగంలో ఉంచాలి. మరొక చేతిని పొట్ట మీద ఉంచాలి. ఇప్పుడు నాలుగు అంకెలు లెక్కబెడుతూ గాలి లోపలికి పీల్చాలి.. పొట్ట బిగుతుగా అయ్యాక మెల్లిగా నాలుగు అంకెలు లెక్కపెడుతూ  నోటి ద్వారా గాలి బయటకు వదలాలి. ఇలా ప్రతిరోజూ ఐదు నుంచి పదినిమిషాలు చేయాలి. రోజుకి మూడు నాలుగు సార్లు చేయాలి. ఈ ఆసనాన్ని వజ్రాసనంలో కూర్చొని కూడా వేయొచ్చు. 

లంగ్​ బ్రీతింగ్​..

వజ్రాసనంలో కూర్చొని ఊపిరితిత్తుల నిండా గాలి నింపాలి. 30 సెకన్ల తర్వాత మెల్లగా గాలి వదలాలి.

సైడ్​ బెండ్​ ...

మోకాళ్లపై కూర్చొని కుడి చేతిని నేలకి ఆనించాలి. గాలి పీల్చుతూ ఎడమచేతిని కుడివైపుకు  వీలైనంత పైకి లేపాలి.  తర్వాత ఎడమచేతిని నేలకు ఆనించి కుడి చేత్తో చేయాలి. 

మినీ స్వాన్​ ... 

యోగా మ్యాట్​పై బోర్లా  పడుకోవాలి. అర చేతుల్ని ఆసరాగా చేసుకుని ఛాతి, మెడ భాగాల్ని వీలైనంత పైకి ఎత్తుతూ గాలి పీల్చాలి. నెమ్మదిగా గాలి వదులుతూ నుదిటిని నేలకు ఆనించాలి. 

బటర్​ ఫ్లై స్ట్రెచ్​
 యోగా మ్యాట్​పై సుఖాసనంలో కూర్చోవాలి. రెండు పాదాలు ఒకదానికి ఒకటి ఎదురుగా పెట్టాలి. తర్వాత అరికాళ్లను ఒకదానితో ఒకటి కలపాలి. రెండు మోకాళ్లు సాధ్యమైనంతవరకు నేలకు ఆనించి చేతులతో పాదాలు పట్టుకోవాలి. ఇప్పుడు గాలి పీలుస్తూ.. వదులుతూ..  20 నుంచి 30సార్లు పైకి, కిందకి  కాళ్లను ఆడించాలి. 

క్యాట్​ అండ్​ కౌ.. 

యోగామ్యాట్​పై మోకాళ్ల  మీద కూర్చుని అరచేతుల్ని ముందుకు పెట్టి నేలమీద ఆనించాలి. వంగిన పొజిషన్​ వస్తుంది.  గాలి పీల్చుతూ తల వీలైనంత పైకి లేపాలి. తర్వాత గాలి వదులుతూ తల ఛాతి వైపుకు తీసుకురావాలి. వీపు  భాగం నెమ్మదిగా పైకి లేపాలి. మళ్లీ గాలి పీలుస్తూ తల ముందుకు, పొట్ట భాగం నేల వైపుకు తేవాలి. ఇలా 5 నుంచి 6 సార్లు చేయాలి. 

హిప్​ స్ట్రెచ్​

ఈ ఆసనం కోసం యోగా మ్యాట్​పై వెల్లకిలా పడుకోవాలి. కాళ్లు రెండూ మడిచి  అరచేతుల్ని  శరీరానికి సమాంతరంగా ఉంచాలి. అర చేతులు, కాళ్లని ఆసరాగా చేసుకుని గాలి పీల్చుతూ  ఛాతి, నడుము భాగాల్ని వీలైనంత పైకి లేపాలి. 30 సెకన్ల తర్వాత మెల్లిగా గాలి వదులుతూ మునుపటి పొజిషన్​కి రావాలి. 
 

Tagged yoga asanas, Celebrity Fitness Expert , Yasmin Karachiwala

Latest Videos

Subscribe Now

More News