వింటర్లో పొడిబారిన జుట్టును చూస్తే బాధగా అనిపిస్తుంది. అక్కడితో ఆగితే ఓకే. కానీ అదే విపరీతంగా జుట్టు రాలుతుంటే టెన్షన్ పుడుతుంది. దాంతో ఏవేవో టిప్స్ ఫాలో అవుతుంటారు. అసలు జుట్టు రాలడానికి రీజన్సూ, రెమెడీసూ ఉన్నాయని అంటోంది బాలీవుడ్ సెలబ్రిటీ ఫిట్నెస్ ట్రైనర్ యాస్మిన్ కరాచీవాలా. హెయిర్ ఫాల్ గురించి డెర్మటాలజిస్ట్ డా.జయశ్రీ శరద్‌తో కలసి ఓ వీడియో షేర్ చేసింది యాస్మిన్. ఈ డ్రమటిక్ వీడియోలో యాస్మిన్ తన దోస్తు జుట్టు రాలుతోందని ఆయిల్ రాయబోతుంది. కానీ డా.జయశ్రీ వద్దని.. హెయిర్ ఫాల్‌కి కారణాలు చెప్తూ.. జుట్టు ఊడిపోకుండా ఏం చేయాలో కూడా చెప్పింది.
రీజన్స్: వంశపారంపర్యం, ఒత్తిడి, స్మోకింగ్, పోషకాహార లోపం, హెల్త్ ఇష్యూస్, హెయిర్ స్టయిల్ ప్రొడక్ట్స్ రెమెడీస్: హై ప్రోటీన్ డైట్, ప్రశాంతంగా ఉండటం, హెయిర్ స్టయిలింగ్ ప్రొడక్ట్స్ వాడకపోవడం, డెర్మటాలజిస్ట్‌ను కలిసి మందులు వాడటం, బయోటిన్, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, జింక్ వంటి సప్లిమెంట్స్ తీసుకోవడం.
