కనురెప్పల వెంట్రుకలు  పెరగడానికి టిప్స్‌

కనురెప్పల వెంట్రుకలు  పెరగడానికి టిప్స్‌


కళ్లు అందంగా, పెద్దగా కనిపించాలని కనురెప్పల వెంట్రుకలను ఆర్టిఫిషియల్‌గా పెట్టించుకుంటారు చాలామంది. అలా కాకుండా చక్కగా, ఒత్తుగా పెరగాలంటే ఈ టిప్స్‌ ఫాలో అవ్వాలి.

  • కనురెప్పల వెంట్రుకలను ప్రతిరోజు దువ్వాలి. అలా చేయడం వల్ల రక్తప్రసరణ జరిగి వెంట్రుకలు బాగా పెరుగుతాయి. దానికోసం ప్రత్యేకంగా బ్రష్‌లు ఉంటాయి. అలా కాకపోయినా మస్కారా బ్రష్‌ను బాగా కడిగి దాన్నైనా వాడొచ్చు. 
  • విటమిన్‌, ప్రొటీన్‌,  ఫ్యాటీ యాసిడ్స్‌ ఎక్కువగా ఉన్న ఫుడ్​ తీసుకోవాలి. గుడ్డు, మాంసం, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి.   
  • ఒక కప్పు స్ట్రాంగ్‌ గ్రీన్‌ టీ చేసి దాన్ని చల్లారబెట్టాలి. కాటన్‌ ప్యాడ్‌ని గ్రీన్‌టీలో ముంచి, కనురెప్పల వెంట్రుకల మీద  రాయాలి. ఇలా రోజుకు రెండుసార్లు చేస్తే కనురెప్పలపైన వెంట్రుకలు వత్తుగా పెరుగుతాయి.   
  • ఒక గుడ్డు, టేబుల్‌స్పూన్‌ గ్లిజరిన్‌ లేదా పెట్రోలియం జెల్లీ వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని కనురెప్పల వెంట్రుకలకు రాయాలి. వారానికి మూడుసార్లు ఈ విధంగా చేస్తే కనురెప్పల వెంట్రుకలు బాగా పెరుగుతాయి. 
  • ఆలివ్‌ లేదా కొబ్బరినూనెను కొద్దిగా వేళ్లపైన వేసుకోవాలి. కనురెప్పల వెంట్రుకలపైన ఐదు నిమిషాలు మసాజ్‌ చేయాలి. వారంలో కనీసం నాలుగుసార్లు ఇలా చేయాలి. ఆముదం, కొబ్బరి నూనె, ఆలివ్‌ నూనెలో ఉండే ఫాటీ యాసిడ్స్‌ వల్ల కనురెప్పల వెంట్రుకలు హెల్దీగా ఉంటాయి.