కళ్ల రక్షణకు తీసుకోవల్సిన జాగ్రత్తలు ఇవే

కళ్ల రక్షణకు తీసుకోవల్సిన జాగ్రత్తలు ఇవే

టెక్నాలజీతో ముడిపడిన రోజులివి. ల్యాప్ టాప్, మొబైల్ రోజువారి జీవితంలో భాగమయ్యాయి. కంప్యూటర్, సెల్ ఫోన్లను ఎక్కువగా వినియోగించడం వల్ల కళ్లు త్వరగా అలసిపోతాయి. కళ్లు అలసిపోకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి ఏమిటంటే.. తరుచుగా క్యారెట్‌ , పాలకూరలాంటివి బాగా తినాలి. కళ్లు మెరవాలంటే గ్రీన్‌ టీ బ్యాగ్స్‌ ను కళ్ల మీద పెట్టుకోవాలి. ఇలా చేస్తే కళ్లల్లో మంట తగ్గుతుంది. కంటినిండా నిద్రపోవాలి. ఒత్తిడి పడకూడదు. సహజంగా ఈ రెండు కారణాల వల్ల త్వరగా అలసిపోతాయి.

కాటన్‌ ప్యాడ్స్‌ ను చల్లటి నీళ్లలో ముంచి పది నిమిషాలు కనురెప్పల మీద పెట్టు కోవాలి. ఇలా చేయడం వల్ల కళ్లు బరువెక్కినట్టు అనిపించవు. కాటన్‌ ప్యాడ్స్‌ సరైన పాళ్లల్లో మాత్రమే చల్లదనాన్ని కళ్లకు అందివ్వాలి. అప్పుడే కళ్లు తాజాగా ఉంటాయి. రెండు కీరదోసకాయలు తీసుకుని వాటిల్లోంచి రసాన్ని తీయాలి. కళ్ల కింద నల్లటి వలయాల మీద కాటన్‌ ప్యాడ్స్‌ తో ఈ రసాన్ని అప్లై చేసి పదిహేను నిమిషాలు అలాగే ఉంచాలి. ఇలా ఐదు రోజులు చేస్తే కళ్లు అందంగా తయారవుతాయి.