ఫుడ్​ పాయిజన్.. 40 మంది స్టూడెంట్లకు అస్వస్థత

ఫుడ్​ పాయిజన్.. 40 మంది స్టూడెంట్లకు అస్వస్థత
  • తెల్లారిన తర్వాత  హాస్పిటల్స్​కు తరలింపు
  • పేరెంట్స్​కు లేట్​గా సమాచారం
  • జిల్లా వైద్యాధికారులకూ చెప్పలే 

హనుమకొండ/ కాజీపేట, వెలుగు: హనుమకొండ జిల్లా కాజీపేట మండలం భట్టుపల్లిలోని ఎస్ఆర్ జూనియర్​ కాలేజీ​ ప్రైమ్​ క్యాంపస్​ లో ఆదివారం రాత్రి ఫుడ్​ పాయిజన్​ జరిగింది. డిన్నర్​సమయంలో వెజ్,నాన్​ వెజ్​కర్రీస్​తో తిన్న 40 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. దీని గురించి పేరెంట్స్ కు గాని, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులకు కానీ చెప్పలేదు. స్థానికులు, డాక్టర్ల కథనం ప్రకారం..భట్టుపల్లిలోని ఎస్ఆర్​ ప్రైమ్ ​క్యాంపస్​ లో అమ్మాయిలు, అబ్బాయిలకు వేర్వేరుగా హాస్టల్​ వసతితో కాలేజీ నిర్వహిస్తున్నారు. 2 వేల మంది వరకు స్టూడెంట్స్ ​ఉండగా.. ప్రతి ఆదివారం వెజ్, నాన్​వెజ్​తో భోజనం పెడతారు.

ఈ ఆదివారం రాత్రి గర్ల్స్​ క్యాంపస్​లో కొంతమంది చికెన్​..మరికొందరు లడ్డూలు తిన్నారు. భోజనం తర్వాత కొంతమంది కండ్లు తిరగడం, వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. దీంతో సిబ్బంది యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. అయినా పట్టించుకోలేదు. తెల్లవారిన తర్వాత సోమవారం ఉదయం దవాఖానకు తరలించారు. స్వల్ప అస్వస్థతకు గురైన ఆరుగురికి క్యాంపస్​లోనే ట్రీట్​మెంట్​ చేశారు. నలుగురిని హనుమకొండ చౌరస్తాలోని జయ హాస్పిటల్ కు,  మరో 30 మందిని వరంగల్ హంటర్​రోడ్డులోని ఫాదర్​ కొలంబో మెడికేర్ ​హాస్పిటల్​కు తరలించి ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్​ చేశారు. 12 మందిని ఇంటికి పంపించగా 18 మందికి ట్రీట్​మెంట్​ఇస్తున్నారు.  పిల్లలెవరికీ ప్రాణాపాయం లేదని ఫాదర్​ కొలంబో మెడికేర్​దవాఖాన డైరెక్టర్ ​డా.చిన్నపరెడ్డి తెలిపారు.  

ALSO READ :పొంగులేటి ఆక్రమణలో.. 21.5 గుంటల ఎన్​ఎస్పీ ల్యాండ్

సోమవారమే చెప్పారు

పిల్లలను హాస్పిటల్​లో అడ్మిట్​ చేసిన తర్వాత తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో ఫాదర్​ కొలంబో దవాఖానకు తరలివచ్చారు. దవాఖాన వర్గాలు హెల్త్​ డిపార్ట్​మెంట్​కు చెప్పగా డిస్ట్రిక్ట్​ సర్వేలెన్స్​ఆఫీసర్ డా.వాణిశ్రీ వచ్చి స్టూడెంట్స్​తో  మాట్లాడారు. ఆమె మాట్లాడుతూ కాలేజీ యాజమాన్యం సమాచారం ఇవ్వలేదన్నది వాస్తవమేనన్నారు. క్యాంపస్ ను విజిట్​ చేసినట్లు చెప్పారు. ఘటనపై విచారణ జరుపుతున్నామన్నారు.  కాలేజీలో కొంతమంది పిల్లలకు చికిత్స చేస్తున్నట్టు తెలుసుకున్న మీడియా అక్కడికి వెళ్లగా అనుమతించలేదు.