ఖమ్మం రూరల్, వెలుగు : ఏదులాపురం మున్సిపాలిటీలో పలు హోటళ్లు, మొబైల్ టిఫిన్ సెంటర్లు, మిల్క్ పార్లర్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు మంగళవారం తనిఖీ చేశారు. అపరిశుభ్రమైన తినుబండారాలను, కుళ్లిపోయిన అల్లం, పాచిపోయిన చట్నీలను ధ్వంసం చేశారు.
అపరిశుభ్రమైన కిచెన్, దుమ్ముదూళితో ఉన్న పైకప్పులు, గాలి, వెలుతురు లేకుండా గదులను గుర్తించారు. వరంగల్ క్రాస్రోడ్లో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఐదు టిఫిన్ సెంటర్లు, రెండు మొబైల్ టిఫిన్ సెంటర్లు, రెండు మిల్క్ పార్లర్లకు నోటీసులు ఇచ్చారు. ఫుడ్ హ్యాండ్లర్లు మాస్కులు, గ్లౌవ్స్, హెయిర్ కవర్లు లేకుండా పని చేస్తున్న సిబ్బందికి పలు సూచనలు చేశారు.
రెండు హోటళ్ల నుంచి శాంపిళ్లు లేబోరేటరికీ పరీక్ష కోసం పంపించారు. తనిఖీల్లో ఫుడ్ అధికారులు ఆర్ కిరణ్కుమార్, సీహెచ్ లోకేశ్, శరత్, ల్యాబ్ టెక్నిషియన్ రతన్రావు తదితరులు పాల్గొన్నారు.
