కారేపల్లి/ జూలూరుపాడు, వెలుగు: రైతుల పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం మక్క జొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని, వాటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ సూచించారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం అప్పాయిగూడెం గోదాంలను ఎమ్మెల్యే గురువారం సందర్శించి, మక్కజొన్న నిల్వలను పరిశీలించారు.
రైతులకు ఇబ్బంది కలగకుండా కొనుగోలు చేసిన మక్కజొన్న నిల్వ చేసేందుకు గోదాములు సిద్ధం చేసినట్లు చెప్పారు. కారేపల్లి మండలంలోని రైతులు పండించిన మక్కజొన్నలు కొనుగోలు చేసి వాటిని నిల్వ చేసేందుకు ఈ గోదాముల్లో ప్రాధాన్యతనివ్వాలని అధికారులను ఆదేశించారు. అనంతరం జూలూరుపాడు మండల కేంద్రంలో నిర్మాణం పూర్తయిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశానికి ఎమ్మెల్యే హాజరయ్యారు.
