ఖమ్మం: అధికారుల సూచన మేరకే మున్నేరుపై చెక్ డ్యామ్ కూల్చివేత

ఖమ్మం: అధికారుల సూచన మేరకే  మున్నేరుపై చెక్ డ్యామ్ కూల్చివేత
  •     కాంగ్రెస్ లీడర్లు 

ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మం సిటీలో మున్నేరుకు ఇరువైపులా నిర్మించే రిటర్నింగ్ వాల్ నిర్మాణంలో భాగంగా అప్పటి ఇరిగేషన్ సీఈ ఆదేశాల మేరకు ప్రకాశ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్ద మున్నేరుపై చెక్‌‌‌‌‌‌‌‌డ్యాం కూల్చివేసినట్లు కాంగ్రెస్  లీడర్లు వెల్లడించారు. చెక్‌‌‌‌‌‌‌‌ డ్యాం కూల్చివేతపై బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ లీడర్లు అసత్యప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గురువారం రాత్రి మంత్రి క్యాంపు ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో కాంగ్రెస్ సిటీ అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, మాజీ కార్పొరేటర్లు కమర్థపు మురళి, మాజీ మేయర్ నీరజ మీడియాతో మాట్లాడుతూ రెండేళ్ల కింద జరిగిన చెక్ డ్యాం కూల్చివేతపై ఇప్పుడు బీఆర్ఎస్ స్పందించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 

బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ హయాంలోనే అగ్రహారం వద్ద మున్నేరుపై నిర్మించాల్సిన చెక్‌‌‌‌‌‌‌‌డ్యాంను ప్రకాశ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్ద నిర్మించారన్నారు. దీంతో గతంలో మున్నేరుకు వచ్చిన వరదతో ఖమ్మం త్రీటౌన్​లో నివాస ప్రాంతాలు మునిగాయన్నారు. సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ ఎ.హన్మంతరావు, లీడర్లు కొప్పెర ఉపేందర్, బాలగంగాధర్ తిలక్, తదితరులు పాల్గొన్నారు.