పాల్వంచ, వెలుగు: భద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కొత్తగూడెం ధర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్)లో పనిచేసే కార్మికులకు మేడే సందర్భంగా శుక్రవారం హైదరాబాద్లో కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి శ్రమశక్తి అవార్డులు ప్రదానం చేశారు.
కేటీపీఎస్ అకౌంట్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న జెన్కో మాల ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బూర్గుల విజయ భాస్కర్ రావు, రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం (టీఆర్ వీకేఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చారుగుండ్ల రమేశ్ అవార్డులు అందుకున్నారు.
