రూ.87 కోట్ల ధాన్యం పక్కదారి!..జగిత్యాల లో మూడు రైస్ మిల్లుల్లో విజిలెన్స్ తనిఖీలు

రూ.87 కోట్ల ధాన్యం పక్కదారి!..జగిత్యాల లో మూడు రైస్ మిల్లుల్లో విజిలెన్స్ తనిఖీలు
  •     యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు

జగిత్యాల టౌన్, వెలుగు: జగిత్యాల జిల్లాలో సీఎంఆర్ ధాన్యం పక్కదారి పట్టినట్లు విజిలెన్స్, ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్ అధికారులు గుర్తించారు. జిల్లాలోని మూడు రైస్ మిల్లుల్లో తనిఖీలు నిర్వహించి సుమారు రూ.87 కోట్ల విలువైన ప్రభుత్వ ధాన్యాన్ని మాయం చేసినట్లు తేల్చారు. విజిలెన్స్, ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్ అడిషనల్ ఎస్పీ బసవరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా సివిల్ సప్లై అధికారి ఎస్.జితేందర్‌‌రెడ్డి, ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్ అధికారులు జిల్లా కేంద్రంలోని శ్రీ అభయాంజనేయ సాయి రైస్ మిల్, శ్రీ లక్ష్మీ బాలాజీ ఇండస్ట్రీస్, లక్ష్మీ గణపతి ఇండస్ట్రీస్‌‌లో తనిఖీలు నిర్వహించారు. 

సుమారు రూ.87 కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ ధాన్యాన్ని పక్కదారి పట్టినట్లు నిర్ధారించారు. అక్రమాలకు పాల్పడిన రైస్ మిల్లుల యాజమాన్యాలపై కలెక్టర్ ఆదేశాల మేరకు జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్‌‌లో కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.