అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్.. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంటే ఇదే మంచి ఛాన్స్!

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్.. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంటే ఇదే మంచి ఛాన్స్!

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఈ–-కామర్స్ కంపెనీ అమెజాన్ ఇండియా గ్రేట్ ఫ్రీడమ్ సేల్ వచ్చే నెల ఏడో తేదీన ప్రారంభం కానుంది. స్మార్ట్‌‌‌‌ఫోన్‌‌‌‌లు, ఫ్యాషన్, బ్యూటీ, హోమ్ అప్లయన్సెస్​పై భారీ డిస్కౌంట్లు లభిస్తాయి. హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈజీ ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం ఇన్​స్టంట్​డిస్కౌంట్​ఉంటుంది. 

రూ.రెండు వేల వరకు క్యాష్‌‌‌‌బ్యాక్ రివార్డులతో పాటు నో కాస్ట్ ఈఎంఐ సౌకర్యం పొందవచ్చు.  షాపింగ్ అసిస్టెంట్ రూఫస్, లెన్స్ ఏఐ వంటి అధునాతన ఫీచర్లతో వినియోగదారులు మరింత సులభంగా షాపింగ్ చేయవచ్చు. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా అదనపు క్యాష్‌‌‌‌బ్యాక్ పొందవచ్చని కంపెనీ వెల్లడించింది.