నగరంలోని పలు రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పాచిపోయిన ఆహార పదార్థాలను భారీగా పట్టుకున్నారు. హోటళ్లలో శుభ్రంగా లేని ఆహారాన్ని ప్రజలకు అంటగడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరించారు. నాణ్యతగా లేని ఆహార పదార్థాలను చూసి పలు హోటళ్లకు వార్నింగ్ ఇచ్చారు.
జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఆదేశాల మేరకు ఫుడ్ సేప్టీ అధికారులు(Food safety officers) గ్రేటర్(GHMC) వ్యాప్తంగా ఉన్న హాస్టల్స్ క్యాంటీన్‌లలో ప్రత్యేక డ్రైవ్(Special drive) చేపట్టారు. సికింద్రాబాద్ లో పలు హోటళ్లలో తనిఖీలు నిర్వహించారు. పద్మారావ్ నగర్‌లోని సీక్రెట్ కిచెన్, గోల్డెన్ క్రౌన్ , మల్టీక్యూసిన్ రెస్టారెంట్, సికింద్రాబాద్‌లోని 4ఎం బిర్యానీ హౌస్‌లు నియమ నిబంధనలకు విరుద్దంగాఉన్నాయని గుర్తించారు.
సికింద్రాబాద్‌లోని రెస్టారెంట్లలో ఫుడ్ కలుషితంగా ఉన్నట్లు గుర్తించారు. పరిసరాలు శుభ్రంగా లేకపోవడం.. ఆహారంలో నాణ్యత లోపించడంతో పాటు ..హోటల్ సందర్శినిలో, రిఫ్రిజిరేటర్ లోపల నిల్వ ఉంచిన సీల్డ్ ఆహార పదార్థాలపై కవర్ సరిగ్గా లేబుల్ లేదని ఫుడ్ సేప్టీ అధికారులు తెలిపారు. . అంతేకాకుండా, కిచెన్ ప్రాంగణంలో క్రిమి ప్రూఫ్ స్క్రీన్ లేదని.. నియమాలకు విరుద్దంగా హోటల్ నడుపుతున్నారన్నారు.
ALSO READ | రోడ్లపై డబ్బులు చల్లుతూ..కూకట్పల్లిలో యూట్యూబర్ ఓవరాక్షన్
గోల్డెన్ క్రౌన్ మల్టీ-క్యూసిన్ రెస్టారెంట్ FSSAI లైసెన్స్ లేకుండా నడుపుతున్నారు. హైదరాబాద్‌లోని రెస్టారెంట్లపై దాడుల అనంతరం సికింద్రాబాద్‌లోని హోటళ్లలో తనిఖీలు చేపట్టారు
అధికారులు నీటి స్తబ్దత, ఓపెన్ డస్ట్‌బిన్‌లు, ఇన్‌సెక్ట్‌ఫ్రూఫింగ్ లేకపోవడం, జిడ్డు మరియు ఫ్లాకీ సీలింగ్ మరియు రెస్టారెంట్‌లో పెస్ట్ కంట్రోల్ రికార్డులు లేవు.సికింద్రాబాద్ రెస్టారెంట్‌లో ఫుడ్ హ్యాండ్లర్లు అప్రాన్లు, హెయిర్‌నెట్‌లు లేదా గ్లౌజులు ధరించకుండా వారి మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్‌లను కూడా డిఫాల్ట్ చేస్తున్నారు. లేబుల్స్ లేని ఆహార పదార్థాలను విక్రయానికి ఉంచినట్లు గుర్తించారు
తనిఖీల్లో భాగంగా వంటగది, వంట సామగ్రి, వాటర్ ట్యాంక్స్, స్టోరేజ్ ఏరియా, తయారు చేసిన ఫుడ్ ఐటమ్స్, రా మెటీరియల్, పారిశుద్ధ్య నిర్వహణ తదితరాలను ఫుడ్ సేఫ్టీ అధికారుల బృందం పరిశీలించారు. నిబంధనలు పాటించని రెసిడెన్షియల్ విద్యాసంస్థలు, హాస్టళ్లకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని అధికారులు హెచ్చరించారు. కమిషనర్ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు 15 రోజుల పాటు నిర్వహించనున్నారు.