బిగ్ బీ బర్త్ డే.. అక్టోబర్ 8 నుండి 11 వరకు ఫిల్మ్ ఫెస్టివల్‌

బిగ్ బీ బర్త్ డే.. అక్టోబర్ 8 నుండి 11 వరకు ఫిల్మ్ ఫెస్టివల్‌

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన 80 వ పుట్టినరోజును అక్టోబర్ 11న జరుపుకోనున్నారు. దశాబ్దాలుగా పలు చిత్రాల్లో అద్భుతమైన నటనతో కోట్లాది అభిమానులను మూటగట్టుకున్న బిగ్ బీకి గౌరవార్థంగా ఈ సారి ఆయన బర్త్ డే ను ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేయనుంది. అందులో భాగంగా అమితాబ్ 80 వ పుట్టినరోజును పురస్కరించుకుని అక్టోబర్‌లో ఫిల్మ్‌ ఫెస్టివల్‌ను నిర్వహించనున్నారు. ఈ ఫెస్ట్ ను అక్టోబర్ 8 నుండి అక్టోబర్ 11 వరకు మొత్తం 4 రోజుల ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌ను నిర్వహించనున్నారు. అమితాబ్ ఫిల్మోగ్రఫీ నుండి 11 ఐకానిక్ సినిమాలు.. భారతదేశంలోని 17 నగరాల్లోని PVR సినిమాస్‌లోని 22 స్క్రీన్‌లలో ప్రదర్శించబడతాయని ఈ సందర్భంగా ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ ప్రకటించింది.

అమితాబ్ నటించిన డాన్, కాలా పత్తర్, కాలియా, కభీ కభీ, అమర్ అక్బర్ ఆంథోనీ, నమక్ హలాల్, అభిమాన్, దీవార్, మిలీ, సెట్టే పే సత్తా, చుప్కే చుప్కే... ఈ సినిమాల ప్రీమియర్‌లు ప్రదర్శించబడనున్నాయి. వీటితో పాటు ముంబైలోని జుహులో ఉన్న పీవీఆర్ సినిమాస్‌లో అమితాబ్ బచ్చన్ జ్ఞాపకాల ప్రత్యేక ప్రదర్శన కూడా జరగనుంది. 

ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ అనేది 2014లో శివేంద్ర సింగ్ దుంగార్‌పూర్‌చే స్థాపించబడిన లాభాపేక్ష లేని సంస్థ. ఇది చలనచిత్రం యొక్క పరిరక్షణ, సంరక్షణ, పునరుద్ధరణకు మద్దతు ఇవ్వడానికి, సినిమా భాష గురించి అవగాహన కల్పించడానికి ఇంటర్ డిసిప్లినరీ ప్రోగ్రామ్‌లను అభివృద్ధి చేయడానికి అంకితం చేయబడింది. ఇక అమితాబ్ బచ్చన్ సినిమాల విషయానికొస్తే... ఇటీవల రణబీర్ కపూర్, అలియా భట్‌లతో బ్రహ్మాస్త్రలో కనిపించారు. ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. తదుపరి చిత్రం వికాస్ బహ్ల్ యొక్క గుడ్ బైలో రష్మిక మందన్న, నీనా గుప్తాలతో నటించనున్నారు. సూరజ్ బర్జాత్యాతో ఉన్నంచై , దీపికా పదుకొనేతో ఇంటర్న్ రీమేక్ , ప్రభాస్, దీపికలతో ప్రాజెక్ట్ K కూడా ఈ లిస్ట్ లో ఉన్నాయి.