92 ఏళ్ల చరిత్రలో టీమిండియా సరికొత్త రికార్డు

92 ఏళ్ల చరిత్రలో టీమిండియా సరికొత్త రికార్డు

ఇంగ్లండ్ తో జరిగిన  ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ను టీమిండియా 4-1 తేడాతో గెలుచుకున్న సంగతి తెలిసిందే.  విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ లాంటి సీనియర్ ఆటగాళ్లు లేకున్నా యంగ్ ప్లేయర్ లతో టీమిండియా ఇంగ్లండ్ ను చిత్తు చిత్తుగా ఓడించింది.  దీంతో  భారత జట్టు 92 ఏళ్ల చరిత్రలో దాని ముందున్న జట్టు ఎవరూ చేయని రికార్డును సాధించింది. ఇప్పటి వరకు579 మ్యాచ్‌లు ఆడిన భారత్ 178 టెస్టులలో గెలవగా మరో  178 మ్యాచ్ లలో ఓటమి పాలైంది. 

 222 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.  దీంతో టీమిండియా  92 ఏళ్ల చరిత్రలో మొదటిసారిగా, భారత్ గెలుపు-ఓటముల నిష్పత్తిని సరిగ్గా 1: 1 సాధించింది.  టెస్టు క్రికెట్‌లో భారత్‌కు మునుపెన్నడూ సమానమైన విజయాలు, పరాజయాలు ఎప్పుడూ లేవు. సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసినందుకు గానూ టీమిండియా సంచలనం యశస్వి జైస్వాల్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు. ఈ సిరీస్ లో  712 పరుగులకు రెండు డబుల్ సెంచరీలు కూడా ఉన్నాయి.