ఇన్ఫర్మేషన్ కావాల్నా.. రూ. 25 వేలు కట్టు

ఇన్ఫర్మేషన్ కావాల్నా.. రూ. 25 వేలు కట్టు
  • మందుల కొనుగోలు వివరాలు అడిగిన వ్యక్తికి ఎంజీఎం షాక్

వరంగల్‍ సిటీ, వెలుగు: ఆర్టీఐ కింద ఇన్ఫర్మేషన్ అడిగిన వ్యక్తికి అధికారులు షాకింగ్ న్యూస్ చెప్పారు. పేపర్‍ ఖర్చు లకు రూ.25 వేలు అవుతుందని, ఆ మొత్తం చెల్లిస్తేనే ఇన్ఫర్మేషన్ ఇస్తామని సంబంధిత అధికారులు చెప్పడంతో అర్జీదారుడికి కంగుతిన్నంత పనైంది. వరంగల్‍ ఎంజీఎంలో గత మూడేళ్లలో మందుల కొనుగోలు సమాచారం కావాలంటూ చక్రపాణి అనే వ్యక్తి వినియోగదారుల మండలి ఆధ్వర్యంలో పోయిన నెల 15న ఆర్టీఐ కింద అప్లై చేశారు. దాదాపు నెల గడిచాక శుక్రవారం సంబంధిత శాఖ ఆఫీసర్లు.. మండలివారు అడిగిన ఇన్ఫర్మేషన్‍ 12,500 కాపీల్లో ఉందని, ఒక్కో పేపర్ కు రూ.2 చొప్పున చెల్లిస్తేనే సమాచారం ఇవ్వడా నికి వీలవుతుందన్నారు. ఆ డబ్బు శాఖ బ్యాంక్‍ అకౌంట్ లో డిపాజిట్‍ చేయాలని, లేదా ఆఫీసులో డైరెక్టు గా నగదు ఇచ్చినా పరవాలేదని సూచించారు. తాము అడిగిన ఇన్ఫర్మేషన్ 10 పేజీలకు మించదని, అధికారులు సమాచారం ఇవ్వలే కనే పెద్దమొత్తంలో డబ్బులు అడుగుతున్నారని చక్రపాణి ఆరోపించారు. తాము అడిగిన ఫార్మాట్ లో సమాచారం ఇవ్వడం లేదంటే .. నేరుగా రికార్డుల పరిశీలనకు అనుమతి ఇవ్వా లని శుక్రవారం ఎంజీఎం సూపరింటెండెంట్ కు ఫస్ట్ అప్పీల్ చేశారు.