మోక్షజ్ఞ ఎంట్రీకి..100 కోట్ల డైరెక్టర్.. ఎవరంటే ?

మోక్షజ్ఞ  ఎంట్రీకి..100 కోట్ల డైరెక్టర్.. ఎవరంటే ?

నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నట వారసుడు మోక్షజ్ఞ(Mokshagna) టాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్దమైందా? అంటే అవుననే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. రీసెంట్ గా మోక్షజ్ఞ లుక్ ఒకటి బాగా వైరల్ అయింది. అంతకుముందు కాస్త బొద్దుగా కనిపించిన మోక్షజ్ఞ.. రీసెంట్ లుక్ లో మాత్రం సన్నబడి చా లా స్టైలీష్ గా కనిపించారు. లేటెస్ట్ గా మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం ఒక సాలిడ్ డైరెక్టర్ సెట్ అయ్యాడని టాక్ వినిపిస్తోంది. 

దసరా మూవీ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) రంగంలో దిగారని తెలుస్తోంది.  నాని(Nani)  కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్  ఇచ్చిన శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ పై బాలయ్య బాబు కు పూర్తీ నమ్మకం ఉందని టాక్. ఇప్పటికే వీరిద్దరి మధ్య కథ చర్చలు స్టార్ట్ అయ్యాయని.. త్వరలో మోక్షజ్ఞ మూవీ పై ప్రకటన రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని సమాచారందీంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి ఆవుతోన్నారు. 

ఇక ఇప్పటికే మోక్షజ్ఞ ఎంట్రీ కోసం టాలీవుడ్ నుంచి ఫేమస్ డైరెక్టర్స్ పేరు వినిపించింది. బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి, పూరీ జగన్నాథ్‌..ఇప్పుడు శ్రీకాంత్ ఓదెల. ఇక డైరెక్టర్ కన్ఫర్మ్ ఇవ్వడమే లేట్ అంటున్నారు ఫ్యాన్స్. అప్పట్లో బాలకృష్ణ డ్రీమ్ ప్రాజెక్టు ఆదిత్య 369(Adithya 369) సినిమాతోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తాడని వార్తలు వచ్చిన విషయం తెలిసేందే. ఇక మోక్షజ్ఞ కూడా డ్యాన్స్,యాక్టింగ్  లో ట్రైనింగ్ తీసుకుంటున్నారని సమాచారం. ఇప్పటికే సన్నబడి.. హ్యాండ్సమ్ లుక్ లో కనిపిస్తున్నారు. ఇదంతా సినిమా ఎంట్రీ కోసమే అని తెలుస్తోంది.