ప్రమోషన్లు, ట్రాన్స్​ఫర్ల కోసం.. పోరుబాట పట్టిన టీచర్లు

ప్రమోషన్లు, ట్రాన్స్​ఫర్ల కోసం.. పోరుబాట పట్టిన టీచర్లు

హైదరాబాద్, వెలుగు: ప్రమోషన్లు, ట్రాన్స్​ఫర్ల షెడ్యూల్ రిలీజ్ చేయాలనే డిమాండ్​తో టీచర్లు పోరుబాట పట్టారు. జాక్టో, యూఎస్​పీసీ  గురువారం రాష్ర్టవ్యాప్తంగా అన్ని జిల్లాకేంద్రాల్లో సామూహిక నిరాహార దీక్షలు నిర్వహించాయి. 2018 జూన్​2 నుంచి మధ్యంతర భృతి ఇస్తామని, ఆగస్టు15 నుంచి పీఆర్సీ ప్రకటిస్తామని సీఎం కేసీఆర్​ ఇచ్చిన హామీలను అమలు చేయాలని జేఏసీ లీడర్లు డిమాండ్ చేశారు. వరంగల్​లో జరిగిన దీక్షల్లో టీచర్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, భువనగిరిలో ప్రొఫెసర్​ కోదండరాం, రంగారెడ్డి లో ఎమ్మెల్సీ రాంచందర్​రావు, నల్గొండలో యూఎస్పీసీ నేత చావ రవి, హైదరాబాద్​లో జాక్టో నేత సదానందంగౌడ్ తదితరులు పాల్గొని మద్దతు ప్రకటించారు. షెడ్యూల్ ప్రకటించకపోతే ఈ నెల 29న హైదరాబాద్​లో మహాధర్నా నిర్వహిస్తామని యూఎస్​పీసీ లీడర్లు హెచ్చరించారు.