- కలెక్టర్ కుమార్ దీపక్
నస్పూర్, వెలుగు: దైనందిన జీవితంలో వ్యాయామం, క్రీడలను భాగం చేసుకోవాలని మంచిర్యాల కలెక్టర్కుమార్ దీపక్ సూచించారు. ఆదివారం మంచిర్యాల పట్టణంలోని ఉషోదయ స్కూల్గ్రౌండ్లో రెవెన్యూ ఉద్యోగులకు ఏర్పాటు చేసిన క్రీడా పోటీల్లో భాగంగా నిర్వహించిన ఫైనల్ పోటీలకు అడిషనల్కలెక్టర్ చంద్రయ్య, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ మహమ్మద్ విలాయత్ అలీతో కలిసి హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ.. రెవెన్యూ ఉద్యోగులకు పని ఒత్తిడి అధికంగా ఉంటుందని క్రీడా పోటీలు వారికి ఉపశమనం కలిగిస్తాయని తెలిపారు. అనంతరం గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు.
ముస్లింలకు రంజాన్ కానుకలు
రంజాన్ పండుగను పురస్కరించుకొని ప్రభుత్వం ముస్లింలకు ఇఫ్తార్ విందుతో పాటు తోఫా అందిస్తుందని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. జిల్లా పరిషత్ బాలుర హై స్కూల్గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ మహమ్మద్ విలాయత్ అలీ, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి నీరటి రాజేశ్వరి, జిల్లా సంక్షేమ శాఖ అధికారి రౌఫ్ ఖాన్, జిల్లా పౌర సంబంధాల అధికారి కృష్ణమూర్తి, తహసీల్దార్ రఫతుల్లా, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్ తో కలిసి హాజరయ్యారు.
