
ఉదల్‌గురి: కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమర్శలకు దిగారు. రాహుల్ అస్సాం వెళ్లాడంటే దాన్నో పిక్నిల్‌లా భావించాలని షా అన్నారు. అస్సాంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని ఉదల్‌గురిలో నిర్వహించిన క్యాంపెయిన్‌లో షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్‌ను టార్గెట్ చేసుకుంటూ ఆయన కామెంట్లు చేశారు. ‘ఈమధ్యే రాహుల్ బాబా అస్సాంను పర్యటించారు. ఆయనకు అస్సాం రావడం అంటే విహార యాత్రకు వచ్చినట్లే. శ్రామికుల గురించి రాహుల్ మాట్లాడుతుంటే నాకు నవ్వొచ్చింది. ఏళ్లపాటు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా టీ గార్డెన్ వర్కర్స్‌కు ఏమీ చేయలేదు. అదే మేం స్టేట్ డెవలప్‌మెంట్ కోసం చాలా కృషి చేశాం’ అని షా పేర్కొన్నారు.