
ఇదేం పైశాచికం రా బాబు.. స్వచ్ఛమైన శాఖాహారి అయిన ఎద్దుకు మాంసం తినిపించడం ఏంటీ..వీళ్లు మనుషులేనా.. చాలా దారుణం.. బతికున్న కోడిని బలవంతంగా ఎద్దుకు తినిపించడం చాలా దారుణం.. ఓ యూట్యూబర్ షేర్ చేసిన వీడియో చూసిన నెటిజన్లు తెగ తిట్టుకుంటున్నారు. జల్లి కట్టు కోసం ఎద్దుకు బతికున్ని కోడిని నోట్లో పెట్టి బలవంతంగా తినిపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
జల్లికట్టు ఎద్దుకు కోడిని బలవంతంగా తినిపిస్తున్న వీడియోను షేర్ చేసిన యూట్యూబర్ పై తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేశారు. సేలం జిల్లాలోని చిన్పప్పంపట్టిలోఎద్దు కోడిని నమలడానికి సంబంధించిన బాధాకరమైన వీడియోలో కనిపిస్తుంది. ముగ్గురు వ్యక్తులు ఎద్దును పట్టుకొని మరొ వ్యక్తి ఎద్దు నోట్లో పచ్చి మాంసాన్ని చొప్పించి తినిపించారు.
అరుణ్ ప్రసన్న అనే పీపుల్ ఫర్ క్యాటిల్ ఎయిమ్ ఇండియా (పీఎఫ్ సీఐ) అనే జంతు సంరక్షణ సంస్థ వ్యవస్థాపకుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చట్టపరమైన సిద్దమయ్యారు పోలీసులు.
ఎద్దులను మచ్చిక చేసుకునే పండుగ అయిన జల్లికట్టులో ఎద్దుల ప్రదర్శన ను పెంపొందించే లక్ష్యంతో కోడిని తినిపించామని, గెలిచిన ఎద్దులు వాటి యజమానులకు బంగారు నాణేలతోపాటు బహుమతులు అందుకుంటారని ఎద్దు యజమానులు చెబుతున్నారు.
ఏదీ ఏమైనా.. ఇంత దారుణంగా ఎద్దులకు అదీ శాఖాహారులకు పచ్చి మాంసం పెట్టడం దారుణం అంటున్నారు నెటిజన్లు.