ఢిల్లీలో జరిగిన 32 ఏళ్ల యుపిఎస్‌సి అభ్యర్థి హత్య కేసును పోలీసులు ఛేదించారు. బాధితుడిని గొంతు కోసి చంపి, ఆ తర్వాత శరీరాన్ని కాల్చి, దీన్ని ప్రమాదవశాత్తు జరిగిన అగ్నిప్రమాదంగా చూపించడానికి ప్రయత్నించిన ముగ్గురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అరెస్టు అయిన వారిలో 21 ఏళ్ల ఫోరెన్సిక్ సైన్స్ విద్యార్థిని కూడా ఉంది.
పోలీసులు అరెస్టు చేసిన నిందితుల్లో ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌కు చెందిన అమృత చౌహాన్ (21), సుమిత్ కశ్యప్ (27), సందీప్ కుమార్ (29) ఉన్నారు. ఈ ముగ్గురు బాధితుడు రామ్ కేశ్ మీనాను హత్య చేసి, అతని శరీరంపై నూనె, నెయ్యి, మద్యం పోసి, ఎల్‌పిజి సిలిండర్ రెగ్యులేటర్‌ను నిప్పంటించి దీన్ని అగ్నిప్రమాదంగా నమ్మించేందుకు ప్రయత్నించారని దర్యాప్తులో తేలింది.
ఈ నెల అక్టోబర్ 6న ఢిల్లీ గాంధీ విహార్‌లోని ఒక ఇంట్లో మంటలు చెలరేగాయని పోలీసులకు కాల్ వచ్చింది. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పగా, పోలీసులు, ఫోరెన్సిక్ బృందం ఫ్లాట్ లోపల పూర్తిగా కాలిపోయిన ఓ మృతదేహాన్ని చూసారు. ఆ మృతదేహం ఫ్లాట్లో ఉండే యూపీఎస్సీ అభ్యర్థి రామ్ కేశ్ మీనాదిగా గుర్తించారు.
మొదట అగ్ని ప్రమాదానికి సంబంధించిన కేసుగా నమోదు చేయగా... కానీ సీసీటీవీ ఫుటేజ్‌లో తెల్లవారుజామున 2:57 గంటలకు, మంటలు చెలరేగడానికి కొద్దిసేపు ముందు ఇద్దరు వ్యక్తులు భవనంలోకి వెళ్లడం, ఆ తర్వాత ఒక మహిళ మరొక వ్యక్తి అక్కడి నుండి వెళ్లిపోవడం కనిపించడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. దర్యాప్తు అధికారులు టెక్నికల్ డేటా విశ్లేషించి, ఘటన జరిగిన సమయంలో అమృత చౌహాన్ మొబైల్ ఆ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు.
అక్టోబర్ 18న అమృతను అరెస్టు చేయడానికి ముందు పోలీసులు చాలా చోట్ల దాడులు చేశారు. విచారణలో ఆమె నేరం ఒప్పుకుంటూ, తన మాజీ ప్రియుడు సుమిత్ కశ్యప్, అతని స్నేహితుడు సందీప్ కుమార్‌లు ఈ నేరంలో తనతో కలిసి ఉన్నారని చెప్పింది. ఆమె చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు ఒక హార్డ్ డిస్క్, ట్రాలీ బ్యాగ్, బాధితుడి చొక్కాను స్వాధీనం చేసుకున్నారు. తర్వాత అక్టోబర్ 21న సుమిత్‌ను, అక్టోబర్ 23న సందీప్‌ను అరెస్టు చేశారు.
బాధితుడు రామ్ కేశ్ మీనా, అమృత గతంలో రిలేషన్‌షిప్‌లో ఉండి కలిసి ఉంటున్నారని పోలీసులు తెలిపారు. రామ్ కేశ్ మీనా, అమృతకు సంబంధించిన కొన్ని అశ్లీల వీడియోలను రికార్డ్ చేసి హార్డ్ డిస్క్‌లో ఉంచాడని, ఆమె పదే పదే అడిగినా వాటిని డిలేట్ చేయడానికి నిరాకరించాడని అమృతకు తెలిసింది. దీనివల్ల తాను ఇబ్బంది పడుతు, అవమాణంగా భావించి.. ఆ తర్వాత ఆమె తన మాజీ ప్రియుడితో కలిసి గొడవ పడింది, చివరకు ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంది అని పోలీసులు తెలిపారు.
అమృత ఫోరెన్సిక్ సైన్స్ విద్యార్థి, క్రైమ్ వెబ్ సిరీస్‌లు ఎక్కువగా చూసేది... దింతో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలి మంటలు వచ్చినట్లు కనిపించేలా ఈ హత్య ప్లాన్ చేసిందని పోలీసులు తెలిపారు. ఎల్‌పిజి సిలిండర్ డిస్ట్రిబ్యూటర్‌గా పనిచేసే సుమిత్, సిలిండర్ రెగ్యులేటర్ తీసి లైటర్‌తో మంటలు అంటించాడని పోలీసులు ఆరోపించారు. తర్వాత నిందితులు మృతుడి హార్డ్ డిస్క్, ల్యాప్‌టాప్‌లు, వస్తువులతో అక్కడి నుండి పారిపోయి, బయట నుండి ఇనుప గేటుకు తాళం వేశారు.
కేసు దర్యాప్తును తప్పుదారి పట్టించడానికి వాళ్ళు చాల ప్రయత్నలు చేసారని... కానీ టైం, టెక్నికల్ డేటా, సిసి కెమెరా ఫుటేజ్ మ్యాచ్ కాకపోబవడంతో వాళ్ళ ప్లాన్ దెబ్బతింది. దింతో కేసు ఛేదించడానికి ఎక్కువ సమయం పట్టలేదు అని సీనియర్ పోలీసు అధికారి అన్నారు.
అయితే ఈ కేసు తదుపరి దర్యాప్తు జరుగుతోందని, మరిన్ని ఆధారాలను పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ముగ్గురు నిందితులు అదుపులో ఉన్నారు. మేము హార్డ్ డిస్క్ ఇతర ఆధారాలను స్వాధీనం చేసుకున్నాము. బలమైన టెక్నికల్, ఫోరెన్సిక్ సపోర్ట్ తో కేసు ముందుకు సాగుతోంది అని డిసిపి రాజా బందియా తెలిపారు.
