పశ్చిమబెంగాల్ మాజీ గవర్నర్ మృతి.. మోడీ సంతాపం

 పశ్చిమబెంగాల్ మాజీ గవర్నర్ మృతి.. మోడీ సంతాపం

పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్  నేత కేషరీనాథ్‌ త్రిపాఠి కన్నుమూశారు.  గతకొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. అదివారం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో తుదిశ్వాస విడిచారు. కేషరీనాథ్‌ త్రిపాఠి పట్ల ప్రధాని నరేంద్ర మోడీసంతాపం తెలిపారు. "కేశరి నాథ్ త్రిపాఠికి రాజ్యాంగ సంబంధమైన విషయాలలో మంచి ప్రావీణ్యం ఉంది. యూపీలో బీజేపీని నిర్మించడంలో కీలకపాత్ర పోషించి రాష్ట్ర ప్రగతికి కృషి చేశారు. ఆయన మృతి చెందారని తెలిసి బాధపడ్డాను. ఆయన కుటుంబ సభ్యులకు నా సానుభూతి తెలుపుతున్నాను. ఓం శాంతి" అని మోడీ ట్వీట్ చేశారు.

నవంబర్ 10, 1934న అలహాబాద్‌లో జన్మించిన త్రిపాఠి...  జూలై 2014 నుండి జూలై 2019 వరకు పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా పనిచేశారు. త్రిపాఠి ఉత్తరప్రదేశ్ శాసనసభకు ఆరుసార్లు ఏన్నికయ్యారు.  మూడుపర్యాయలు స్పీకర్ గా పనిచేశారు. ఇక త్రిపాఠి రెండుసార్లు కోవిడ్ వైరస్ బారిన పడ్డారు.