గండిపేట, వెలుగు:రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్‌ను విమర్శించే స్థాయి ఎవరికీ లేదని బండ్లగూడ జాగీర్ మాజీ డిప్యూటీ మేయర్ పూలపల్లి రాజేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ ఇటీవల తన పాదయాత్ర సందర్భంగా ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రకాశ్ గౌడ్ నిఖార్సైన ప్రజా నాయకుడని, బాధితులకు మెరుగైన పరిహారం అందే వరకు మూసీ ప్రక్షాళన పనులు చేపట్టవద్దని సీఎంతో పోరాడుతున్నారన్నారు. అలాంటి ప్రజా నాయకుడిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోబోమని మెచ్చరించారు. వెంటనే ఎమ్మెల్యేకు కేటీఆర్ క్షమాపణ చెప్పకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయన్నారు.
