భారత మాజీ ఫుట్ బాలర్ సుభాష్ భౌమిక్ (72) తుదిశ్వాస కన్నుమూశారు. దీర్ఘకాలంగా డయాబెటిక్ తోపాటు కిడ్నీ సంబంధింత సమస్యలతో బాధపడుతున్న సుభాష్.. ఇవాళ ఉదయం 3.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. దేశం తరఫున పలు అంతర్జాతీయ టోర్నమెంట్లలో ఆడిన సుభాష్.. 1970లో ఆసియా గేమ్స్ లో గోల్డ్ మెడల్ నెగ్గిన భారత జట్టులో కీలక పాత్ర పోషించాడు. ఈస్ట్ బెంగాల్ తోపాటు మోహన్ భగాన్ క్లబ్స్ కూ ఆయన ప్రాతినిధ్యం వహించాడు. సక్సెస్ ఫుల్ కోచ్ గా మంచి పేరు తెచ్చుకున్న ఆయన.. ఈస్ట్ బెంగాల్, మోహన్ భగాన్, మహ్మదన్ స్పోర్టింగ్, సల్గావ్ కార్, చర్చిల్ బ్రదర్స్ క్లబ్స్ కు కోచ్ గా వ్యవహరించాడు. సుభాష్ భౌమిక్ మృతిపై పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. ఆయన మృతి క్రీడా లోకానికి తీరని లోటు అని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ట్వీట్ చేశారు.
Deeply grieved that stalwart footballer, coach Subhas Bhowmick is no more. 1970 Asian Games medallist, celebrated footballer in Mohun Bagan, East Bengal, representing the country in international tournaments & coached successfully big three clubs of Kolkata, he was a legend.(1/2)
— Mamata Banerjee (@MamataOfficial) January 22, 2022
మరిన్ని వార్తల కోసం:

