తల్లయిన స్టార్ హీరోయిన్!

V6 Velugu Posted on Jan 22, 2022

బాలీవుడ్‌‌ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చింది. నిక్ జోనస్, తాను తల్లిదండ్రులు అయినట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. అయితే ప్రియాంక ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు ఎటువంటి ఫొటోలు, వార్తలు ఇప్పటివరకు బయటకు రాలేదు. దీంతో ఆమె చెప్పేది నిజమేనా కాదా అనే అనుమానాలు వచ్చాయి. కానీ సరోగసీ ద్వారా తాము పండంటి బిడ్డకు జన్మనిచ్చామని పిగ్గీ చాప్స్ వెల్లడించింది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Priyanka (@priyankachopra)

‘సరోగసీ ద్వారా బిడ్డను కుటుంబంలోకి తీసుకొచ్చామని చెప్పడానికి సంతోషిస్తున్నాం. మా ఫ్యామిలీపై ఫోకస్ పెడుతున్న ఈ సమయంలో మాకు ప్రైవసీ ఇవ్వాలని కోరుతున్నాం’ అని ఇన్ స్టాగ్రామ్ లో ప్రియాంక పోస్టు పెట్టింది. ఆమె భర్త నిక్ కూడా ఇదే పోస్టును షేర్ చేశాడు. కాగా, హిందీ సినీ పరిశ్రమలో సినిమాలు తగ్గించిన ప్రియాంక.. హాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో తాజాగా మ్యాట్రిక్స్ రిసరెక్షన్స్ మూవీలో కీలక పాత్రలో నటించింది. ఇకపోతే.. నిక్, ప్రియాంకలు 2018 డిసెంబరులో వివాహం చేసుకున్నారు.

మరిన్ని వా‌‌ర్త‌‌‌‌ల కోసం‌‌:‌‌ ‌‌

రాష్ట్రంలో భారీగా తగ్గిన యాసంగి సాగు

ఆన్​లైన్​ అడిక్షన్.. పెరుగుతున్న ఫ్రస్ట్రేషన్

Tagged Baby, priyanka chopra, surrogacy, Nick jonas, Bollyowod

Latest Videos

Subscribe Now

More News