మాజీ మంత్రి దయాకర్రావుపై కేసు..ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు నమోదు

మాజీ మంత్రి దయాకర్రావుపై కేసు..ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు నమోదు

తొర్రూరు, వెలుగు: మహబూబాబాద్​జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు బీఆర్ఎస్​నేత, మాజీ మంత్రిపై కేసు నమోదైంది. తొర్రూరులో గురువారం ఎర్రబెల్లి దయాకర్ రావు, తన అనుచరులతో కలిసి రాస్తారోకో తీస్తున్నారు. 

ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పినా వినకుండా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించి,  ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడినందుకు దయాకర్ రావు, అతని అనుచరులు పసమర్తి సీతారాములు మంగళపల్లి శ్రీనివాస్, పల్లా సుందర్ రావు, కల్వకొలను ప్రవీణ్ రాజు, లకావత్ సురేశ్, ఈదురు అయిలయ్య, ధరావత్ గాంధీ నాయక్, కుర్ర శ్రీనివాస్, చామకూరి ఐలయ్య, పారుపాటి శ్రీనివాస్, రంగుకుమార్ మరి కొందరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.