యూనివర్సిటీల్లో  సమస్యలు పరిష్కరించాలె

యూనివర్సిటీల్లో  సమస్యలు పరిష్కరించాలె

హైదరాబాద్: రాష్ట్రంలో విద్యా రంగాన్ని  కేసీఆర్ పూర్తిగా నిర్లక్ష్యం చేశారని  మాజీ ఎంపీ మల్లు రవి మండిపడ్డారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో ఆయన స్పందించారు. యూనివర్శిటీల్లో మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. బాసర విద్యార్థులు ఏడు రోజులుగా ఆందోళన చేస్తున్న ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేదని ఫైర్ అయ్యారు. బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్ధులు చేస్తున్న ఉద్యమంలో ఏ రాజకీయ పార్టీ ప్రమేయం లేదన్నారు. సీఎం వెంటనే ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి యూనివర్సిటీ ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకపోతే అన్ని యూనివర్సిటీల్లో ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.