
హైదరాబాద్: మాసబ్ ట్యాంక్లోని పశుసంవర్థక శాఖల కార్యాలయంలో మాజీ ఓఎస్డీ కళ్యాణ్ హల్ చల్ చేశారు. కార్యాలయంలోని ఫైల్స్ అన్ని చించేసి సంచుల్లో మూట కట్టి బయటికి తీసుకెళ్లుందుకు యత్నించారు కళ్యాణ్. ప్రభుత్వం మారడంతో ఓల్డ్ ఫైల్స్ అన్నింటిని చించేసి తీసుకెళ్లేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో మాజీ తలసాని యానిమల్ హస్బెండ్రీ, ఫీషరీస్, సినిమాటోగ్రఫి డిపార్ట్ మెంట్ కి ఓఎస్డీగా కళ్యాణ పనిచేశారు. ఆ యా శాఖలకు చెందిన ఫైల్స్ అన్నీ డిపార్ట్ మెంట్ నుంచి తీసుకెళ్లేందుకు కళ్యాణ్ యత్నించారు.
ఓఎస్డీగా పదవీ కాలం అయిపోయి నాలుగు రోజులు అయినా కూడా డిపార్ట్ మెంట్ కి వచ్చి ఫైల్స్ ని తీసుకెళ్లడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. డిపార్ట్ మెంట్ నుంచి ఎలాంటి ఫైల్స్ తీసుకెళ్లొద్దని సీఎస్ శాంతికుమారి ఆదేశాలు జారీ చేసినప్పటికీ సిబ్బంది సహకారంతో ఫైల్స్ చించేయిస్తున్నారు కళ్యాణ్.
ఇదే విషయమై మాజీ ఓఎస్డీ ని ప్రశ్నించగా.. బీరువాల్లో ఉంటే ఎలుకలు కొడుతున్నాయి. అందుకే ఫైల్స్ తీస్తున్నామని .. ఇవేమీ ఇంపార్టెంట్ కాదంటూ కళ్యాణ్ బుకాయిస్తున్నారు.