ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు కరోనాతో మృతి

ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు కరోనాతో మృతి

ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు వాలెరీ గిస్కేర్డ్ డ్’ఈస్టైన్గ్ (94) కరోనాతో చనిపోయారు. గత కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన నిన్న(బుధవారం) రాత్రి శుదిశ్వాస విడిచారు. వాలెరీ కరోనా లక్షణాలతో గత సెప్టెంబర్‌లో ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. చికిత్స తర్వాత కోలుకున్న ఆయన మళ్లీ అస్వస్థతకు లోనుకావడంతో నవంబర్‌ మూడో వారంలో మళ్లీ ఆస్పత్రిలో చేశారు. అయితే పరిస్థితి విషమించడంతో నిన్న రాత్రి కన్నుమూశారని గిస్కేర్డ్‌ ఫౌండేషన్‌ ప్రకటించింది.

ఫ్రాన్స్‌కు అత్యధిక కాలం అధ్యక్షుడిగా పనిచేసిన చార్లెస్‌ డీ గల్లే తర్వాత 1974లో గిస్కేర్డ్‌ దేశాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తన 48 యేట అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో ఫ్రాన్స్‌ అధ్యక్షుల్లో అత్యంత చిన్న వయస్కుడిగా రికార్డుల్లో నిలిచారు. ఏడు సంవత్సరాల పాటు .. 1981 వరకు ఆ పదవిలో కొనసాగారు. తన పాలనా కాలంలో దేశంలో అనేక ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టారు. దేశంలో హైస్పీడ్‌ టీజీవీ రైల్‌ నెట్‌వర్క్‌తో సహా అనేక పెద్ద ప్రాజెక్టులు ఆయన హయాంలోనే ప్రారంభమయ్యాయి. అదేవిధంగా పరస్పర అంగీకారం ద్వారా విడాకులకు అనుమతించారు. ఓటింగ్‌ వయస్సును కూడా 21 నుంచి 18కి తగ్గించారు వాలెరీ గిస్కేర్డ్ డ్’ఈస్టైన్గ్.