
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ భారత అత్యున్నత పురస్కారం భారత రత్నను ఇవాళ అందుకోనున్నారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రణబ్ కు భారతరత్న అవార్డును అందించనున్నారు. 83 ఏళ్ల ప్రణబ్.. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, పీవీ నరసింహరావు, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాల్లో కేంద్ర మంత్రిగా పని చేశారు. 2012 నుంచి 17 వరకు రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వహించారు. గతేడాది జనవరిలో ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న అవార్డు ప్రకటించారు