కేటీఆర్ పీఏనని చెప్పుకుంటూ.. మోసాలు చేస్తున్న మాజీ రంజీ ప్లేయర్ అరెస్ట్

కేటీఆర్ పీఏనని చెప్పుకుంటూ.. మోసాలు చేస్తున్న మాజీ రంజీ ప్లేయర్ అరెస్ట్

హైదరాబాద్: రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ పీఏ గా పనిచేస్తున్నానని చెప్పుకుంటూ మోసాలకు పాల్పడుతున్న మాజీ రంజీ క్రికెట్ ప్లేయర్ నాగరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. పలువురు వ్యాపారస్తులు, హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్ నిర్వాహకులతోపాటు 9 కంపెనీలను కూడా అరెస్టు చేసినట్లు పోలీసులు గుర్తించారు. నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసిన సందర్భంగా  బషీర్ బాగ్ లోని సీపీ ఆఫీసులో హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ మీడియా సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా హైదరాబాద్ సీపీ అంజనికుమార్ మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ పీఏను అంటూ మోసాలకు పాల్పడుతున్న నాగరాజు అనే వ్యక్తిని అరెస్ట్ చేశామన్నారు. 9 కార్పొరేట్ కంపెనీలను మోసం చేసి 39 లక్షల 22వేల 400 రూపాయలు వసూలు చేశాడని, అలాగే హాస్పిటల్స్,రియల్ ఎస్టేట్ వ్యాపారులు, విద్యా సంస్థల నిర్వాహకులను కూడా మోసం చేశాడన్నారు. బంజారాహిల్స్, మాదాపూర్, కూకట్ పల్లి, గచ్చి బౌలి పోలీస్ స్టేషన్లలో ఇతడి పై కేసులు ఉన్నాయని, ఇప్పటి వరకు మొత్తం 9 కేసులు నాగరాజు పై ఉన్నాయని వివరించారు. గతంలో నాగరాజు పై తెలంగాణతోపాటు ఏపీ లో 10 కేసులు ఉన్నాయని, సైబరాబాద్, గుంటూరు, వైజాగ్ లో ఇతడిపై ఛీటింగ్ కేసులు ఉన్నాయని తెలిపారు. స్వచ్చంద సంస్థకు సేవల పేరుతో కార్పొరేట్ కంపెనీల దగ్గర డబ్బులు వసూలు చేశాడన్నారు. కేటీఆర్ ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడని కార్పొరేట్ కంపెనీల దగ్గర డబ్బులు వసూలు చేశాడని, నిందితుడి పై పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్నారు. నిందితుడి నుంచి 10 లక్షల రూపాయలు, ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని మరింత లోతుగా విచారణ చేస్తున్నామన్నారు. ఎవరైనా మంత్రి పీఏ అని చెప్పి డబ్బులు అడిగితే ఇవ్వొద్దని, అలాంటి వారిని నమ్మకుండా జాగ్రత్తపడాలన్నారు.

ఇవి కూడా చదవండి

మళ్లీ మోగుతున్న వాట్సప్ ‘ప్రైవసీ’ గంటలు..

ప్రియుడితో పెళ్లికోసం చిన్నారిని ఎత్తుకెళ్లిన యువతి

ఏడాదికి 50 కిలోల ఫుడ్ పడేస్తున్నం

ఆకతాయిల వేధింపులు: నార్సింగిలో యువతి సూసైడ్