వీల్ చైర్ లో పోచారం శ్రీనివాస్ రెడ్డి.. ఆందోళనలో అభిమానులు

వీల్ చైర్ లో పోచారం శ్రీనివాస్ రెడ్డి.. ఆందోళనలో అభిమానులు

సీనియర్ బీఆర్ఎస్ నేత, మాజీ స్పీకర్, బాన్సువాడ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొందిన పోచారం శ్రీనివాసరెడ్డి వీల్ చైర్ లో ఉండటం సంచలన చర్చగా మారింది. డిసెంబర్ 8వ తేదీ ఉదయం.. మాజీ సీఎం కేసీఆర్ ను చూసేందుకు యశోధ ఆస్పత్రికి వచ్చిన పోచారం.. వీల్ చైర్ ద్వారా ఆస్పత్రికి లోపలికి వెళ్లటం.. అభిమానులను ఆందోళనకు గురి చేసింది..

పోచారం శ్రీనివాసరెడ్డి కారు దిగి.. నడవలేవలేకపోవటంతో.. ఆయన్ను వీల్ చైర్ లో కూర్చుబెట్టి.. ఎమర్జెన్సీ వార్డు ద్వారా ఆస్పత్రి లోపలికి తీసుకెళ్లారు ఆయన సహాయకులు. పోచారం శ్రీనివాసరెడ్డి వయస్సు 74 ఏళ్లు.. గత అసెంబ్లీలో ఆయన స్పీకర్ గా పని చేశారు. ఇప్పుడు కూడా బాన్సువాడ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది.. డిసెంబర్ 9వ తేదీ శనివారం అసెంబ్లీలో.. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది.

ఇలాంటి సమయంలో పోచారం శ్రీనివాసరెడ్డి.. వీల్ చైర్ లో.. ఆస్పత్రిలోకి వెళ్లటం అనేది చర్చనీయాంశం అయ్యింది. కేసీఆర్ ను పరామర్శించటానికి వచ్చారా లేక చికిత్స కోసం వచ్చారా అనేది తెలియాల్సి ఉంది. ఒక వేళ కేసీఆర్ ను పరామర్శించటానికి వెళ్లినట్లయితే.. వీల్ చైర్ లో వెళ్లటం ఏంటనే ప్రశ్న తలెత్తుతుంది. మొత్తానికి కేసీఆర్ బెడ్ పై ఉన్నప్పుడే.. ఆయన సహచరుడు పోచారం సైతం వీల్ చైర్ లో కనిపించటం బీఆర్ఎస్ శ్రేణులను ఆందోళనకు గురి చేస్తుంది.