టీమిండియా మాజీ పేసర్‌ శ్రీశాంత్‌పై మూడేండ్ల నిషేధం

టీమిండియా మాజీ పేసర్‌ శ్రీశాంత్‌పై మూడేండ్ల  నిషేధం

తిరువనంతపురం: టీమిండియా మాజీ పేసర్‌ ఎస్‌‌‌‌‌‌‌‌. శ్రీశాంత్‌‌‌‌‌‌‌‌పై కేరళ క్రికెట్‌‌‌‌‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌‌‌‌‌ (కేసీఏ) మూడేండ్ల సస్పెన్షన్‌‌‌‌‌‌‌‌ విధించింది. చాంపియన్స్‌‌‌‌‌‌‌‌ ట్రోఫీకి సంజూ శాంసన్‌‌‌‌‌‌‌‌ను ఎంపిక చేయకపోవడంపై శ్రీ తమ సంఘంపై చేసిన విమర్శలకు చర్యలు తీసుకుంది. ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ 30న ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని కేసీఏ పేర్కొంది. ప్రస్తుతం కేరళ క్రికెట్ లీగ్‌‌‌‌‌‌‌‌ ఫ్రాంచైజీ అయిన కొల్లం ఏరీస్‌‌‌‌‌‌‌‌కు శ్రీశాంత్‌‌‌‌‌‌‌‌ సహ యజమానిగా ఉన్నాడు.

అయితే విజయ్‌ హజారే ట్రోఫీలో శాంసన్‌‌కు చోటు కల్పించకపోవడం వల్లే చాంపియన్స్‌ ట్రోఫీకి తీసుకోలేదని శ్రీశాంత్‌‌‌‌‌‌‌‌ ఓ చానెల్‌‌‌‌‌‌‌‌ ఇంటర్వ్యూలో విమర్శించాడు. దీనికి శ్రీశాంత్‌‌‌‌‌‌‌‌తో పాటు కొల్లం ఏరీస్‌‌‌‌‌‌‌‌, అలప్పుజ టీమ్‌‌‌‌‌‌‌‌, అలప్పుజ రిప్పల్స్‌‌‌‌‌‌‌‌కు షోకాజ్‌‌‌‌‌‌‌‌ నోటీసులు జారీ చేశారు. షోకాజ్‌‌‌‌‌‌‌‌ నోటీసులకు ఫ్రాంచైజీలు ఇచ్చిన వివరణకు సంతృప్తి చెందిన కేసీఏ వారిపై తదుపరి చర్యలు తీసుకోలేదు. కానీ శ్రీశాంత్‌‌‌‌‌‌‌‌ ఎలాంటి వివరణ ఇవ్వకపోవడంతో సస్పెన్షన్‌ వేటు పడింది.