క్రికెట్ బెట్టింగ్ ముఠా ఆటకట్టు

క్రికెట్ బెట్టింగ్ ముఠా ఆటకట్టు

 

  • నలుగురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
  • రూ.37.84 లక్షల క్యాష్​సీజ్

గచ్చిబౌలి, వెలుగు: ఐపీఎల్​మ్యాచ్ లపై ఆన్​లైన్​బెట్టింగ్​నిర్వహిస్తున్న ముఠాను సైబరాబాద్​పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఓటీ డీసీపీ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. సిటీ శివారు బీరంగూడ సింపనీ పార్కులో ఉండే మొగిలిగిద్ద రామకృష్ణగౌడ్(30), అతని అన్న ఉపేందర్ గౌడ్(40) ఈజీ మనీ కోసం క్రికెట్ ​బెట్టింగ్ ప్లాన్​ చేశారు. సోను అనే మెయిన్ బుకీ నుంచి సామగ్రి తీసుకుని, బీరంగూడ కమాన్​సమీపంలోని ఓ బిల్డింగ్​లో ఆన్​లైన్ ​బెట్టింగ్​స్టార్ట్ చేశారు. 40 మంది ఫంటర్లతో కలిసి నైస్ 7777, ప్రో వెబ్సైట్ ద్వారా బెట్టింగ్స్​దందా కొనసాగిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం జరిగిన ముంబై- వర్సెస్​ ఢిల్లీ, రాత్రి జరిగిన లక్నో- వర్సెస్​గుజరాత్ మ్యాచ్ లపై బెట్టింగ్​నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ జోన్​ఎస్ఓటీ పోలీసులు, ఆర్సీపురం పోలీసులతో కలిసి బెట్టింగ్ స్థావరంపై దాడి చేశారు. 

రామకృష్ణగౌడ్​ను పట్టుకుని విచారించారు. అతను ఇచ్చిన సమాచారంతో ఉపేందర్ గౌడ్​ను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరి నుంచి రూ.18.50 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. బెట్టింగ్​కోసం ఉపయోగిస్తున్న బ్యాంక్​అకౌంట్లలోని రూ.18.34 లక్షల క్యాష్​ను సీజ్ చేశారు. వీరి వద్ద బెట్టింగ్​వేస్తున్న గాజులరామారానికి చెందిన డీసీఎం డ్రైవర్ తలారి శ్రీనివాస్(38), తాపీ మేస్త్రి బండి విజయ్​కుమార్(44)ను అరెస్ట్ చేశారు. ప్రధాన బుకీ సోనూ, చందానగర్​కు చెందిన ఫంటర్​అంజి, పటాన్​చెరుకు చెందిన చంద్రం, కూకట్​పల్లికి చెందిన దోరాలు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడీసీపీలు, ఏసీపీ, ఇన్ స్పెక్టర్లు పాల్గొన్నారు.