
సూర్యాపేట జిల్లాకు చెందిన నాలుగు నెలల బాబు కరోనా వైరస్ సోకి మృతి చెందాడు. సూర్యాపేట సమీపంలోని కాసరబాద గ్రామానికి చెందిన నాలుగు నెలల చిన్నారి ఆరోగ్యం బాగోలేక పోవడంతో ఆ బాబు తల్లిదండ్రులు మంగళవారం అతన్ని హైదరాబాద్ లోని నీలోఫర్ చిన్నపిల్లల ఆస్ప్రత్రికి తీసుకెళ్లారు. అనుమానంతో అక్కడి వైద్యులు కరోనా టెస్టు చేయగా.. ఆ బాబుకి పాజిటివ్ అని తేలింది. బుధవారం చికిత్స అందించే సమయంలో ఆ చిన్నారి గుండె కి రంధ్రం ఉన్నదని , కరోనా వైరస్ సోకడంతో శ్యాస తీసుకోలేక మరణించాడని వైద్యులు తెలిపారు.
కాసరబాద గ్రామానికి చెందిన ఆ చిన్నారి తల్లి ప్రసవం కోసం కోసం ఆత్మకూర్(ఎస్) మండలం ఏపూర్ లోని పుట్టింటికి వెళ్లింది. డెలివరీ అయిన నాలుగు నెలల తర్వాత ఆమె కాసరబాద గ్రామానికి వచ్చింది. అయితే కొద్ది రోజుల క్రితం ఆ పసివాడికి జ్వరం రావడంతో స్థానిక ఆస్పత్రిలో చూపించారు. జ్వరం తగ్గకపోవడంతో ఆ బాబును మంగళవారం హైదరాబాద్ లోని నీలోఫర్ చిన్నపిల్లల ఆస్ప్రత్రికి తీసుకెళ్లగా అక్కడ పాజిటివ్ అని తేలింది. వైరస్ కారణంగా బుధవారం మధ్యాహ్నం ఆ చిన్నారి మరణించాడు.బాబు తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు గా విలపిస్తున్నారు.