హత్యకు యత్నించిన నిందితుడికి నాలుగేండ్ల జైలుశిక్ష

హత్యకు యత్నించిన నిందితుడికి నాలుగేండ్ల జైలుశిక్ష

మేడ్చల్, వెలుగు:  హత్యకు యత్నించిన నిందితుడికి నాలుగేండ్ల జైలు శిక్ష, రూ. 1500 జరిమానా విధిస్తూ మేడ్చల్ జడ్జి ఎం. అర్జున్ సోమవారం తీర్పు చెప్పారు. మేడ్చల్ అసిస్టెంట్ సెషన్ కోర్టు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కృష్ణమూర్తి తెలిపిన ప్రకారం.. మేడ్చల్ జిల్లా సూరారం వెంకట్రామ్ నగర్ కు చెందిన కె. శాలినిరాజు  ఓ ప్రైవేట్ ఫార్మా కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. 2019 మే 20న తన స్కూటీపై డ్యూటీ కి వెళ్తున్నాడు. 

అదే కంపెనీ నుంచి డ్యూటీలోంచి తీసివేసిన వెంకట సుబ్బారావు అడ్డుకుని స్కూటీ ఆపి కొడవలితో శాలినిరాజుపై దాడిచేశాడు. స్థానికులు రావడంతో నిందితుడు పారిపోయాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు నివేదికను దుండిగల్ పోలీసులు కోర్టులో సమర్పించారు. విచారణ చేసిన కోర్టు జడ్జి పై విధంగా తీర్పు చెప్పారు.