ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యల ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్ నుంచి నాలుగో సాంగ్

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యల ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్ నుంచి నాలుగో  సాంగ్

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా ‘నైంటీస్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ ఫేమ్  ఆదిత్య హాసన్ రూపొందిస్తున్న  చిత్రం ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’.  సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.  మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్..  ఇప్పటికే మూడు  పాటలు విడుదల  చేయగా, మంగళవారం ఫోర్త్  సాంగ్‌‌ను రిలీజ్ చేశారు.  హేషమ్ అబ్దుల్ వహాబ్  కంపోజ్ చేయగా, శ్రీహర్ష ఇమాని అందించిన లిరిక్స్,  సంజిత్ హెగ్డే,  సితార కృష్ణకుమార్ పాడిన తీరు ఆకట్టుకుంది.

  ‘దేశంకాని దేశంలో ఏదో వీరావేశంలో.. ఎగిరి ఎగిరే పతంగులురా.. నువ్వైనా నేనైనా... రంగు రూపు భాషల్లో ఎన్నో ఎన్నో  భేదాల్లో .. ఆశలు, భయాలు ఒక్కటేరా.. నీకైనా నాకైనా కోరుకున్న  లైఫ్ ఇదే.. ఎవరికి ఎవరు ఏమీకాని చోటు ఇదే.. వేల మైళ్ల దూరమే మనవారికి, ఊరికి...’ అంటూ సాగిన పాటలో చదువులు, కెరీర్ కోసం విదేశాలకు వెళ్లి.. అక్కడి జీవన శైలిని చూపించారు. ఆనంద్, వైష్ణవి స్టైలిష్ లుక్‌‌లో కనిపిస్తూ ఇంప్రెస్ చేశారు. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌‌ను   గుంటూరులోని వీవీఐటీ కాలేజ్‌‌లో  నిర్వహించగా అక్కడ  మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. సెప్టెంబర్ 11న సినిమా విడుదల  కానుంది.